నిరాశపరిచిన ‘దేవ్’ మొదటి రోజు కలెక్షన్లు..!

కార్తీ, రకుల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దేవ్’. ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14న (నిన్న) తమిళ్ తోపాటు తెలుగులో కూడా విడుదలయ్యింది. అయితే ఈ చిత్రం మొదటి షో నుండే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. దీంతో పూర్ రివ్యూస్ వచ్చాయి. అడ్వెంచర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని చూడటం కూడా ఓ అడ్వెంచరే.. అంటూ సోషల్ మీడియాలో ఈ చిత్రం పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మొదటి రోజు కలెక్షన్లు కూడా అదేవిధంగా ఉండడం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రానికి 5.70 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇందులో కోలీవుడ్లో ఈ చిత్రం మొదటి రోజు 3.30 కోట్ల గ్రాస్ కాగా… తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 28 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం పక్కన పెట్టి 50 శాతం వసూళ్ళు రాబట్టడమే చాలా కష్టం అంటున్నారు ట్రేడ్ పండితులు. అందులోనూ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే సినిమాలకి కలెక్షన్లు రావడం చాలా కష్టమని ‘దేవ్’ చిత్రం మరోసారి ప్రూవ్ చేస్తుందని ఫిలిం విశ్లేషకులు చెబుతున్నారు. ఇక గత ఏడాది ‘కడై కుట్టి సింగం’(తెలుగులో ‘చినబాబు’) తో బ్లాక్ బ్లాస్టర్ హిట్టందుకున్న కార్తి ఈ సారి ‘దేవ్’ రూపంలో డిజాస్టర్ ని చవి చూసాడు. నూతన దర్శకుడు రజత్ రవి శంకర్ టేకింగ్ ఏమాత్రం జోరందుకోగా.. ప్రేక్షకుల సహనాన్ని టెస్ట్ చేసే విధంగా ఉందని… ఇక హరీష్ జైరాజ్ సంగీతం వినడానికి బాగానే ఉన్నప్పటికీ.. విజయాల గా మాత్రం సరిగ్గా తెరకెక్కించలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం చాలా అసలు పెట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా పెద్ద దెబ్బే అని చెప్పడంలో సందేహం లేదు…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus