పందొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ కలిశారు!

భాషతో సంబంధం లేకుండా, మాస్-క్లాస్ అన్న బేధం లేకుండా అందర్నీ అమితంగా ఆకట్టుకొని అలరించి.. రాజమండ్రి, ఏలూరు లాంటి మాస్ ఏరియాస్ లోనే వంద రోజులు ఆడిన హాలీవుడ్ క్లాసిక్ ఫిలిమ్ “టైటానిక్”. స్వచ్చమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికీ లవ్ స్టోరీస్ పరంగా నిఘంటువుగా పేర్కొంటుంటారు. అంతటి విశేషమైన చరిత్ర కలిగిన “టైటానిక్” డైరెక్టర్ జేమ్స్ కేమరాన్, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేట్ విన్స్ లెట్ మళ్ళీ కలిసి పని చేయలేదు. కారణాలు ఏవో తెలియదు కానీ.. వారిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూద్దామని ప్రతి సినిమా అభిమాని ఎదురుచూస్తూనే ఉన్నాడు.

వారి కల దాదాపు పందొమ్మిదేళ్ళ తర్వాత అనగా ఈ ఏడాది తీరానుంది. కేమరాన్ “అవతార్” సిరీస్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే, ఈ సిరీస్ లో రూపొందబోయే రెండో చిత్రమైన “అవతార్ 2″లో కేట్ విన్స్ లెట్ ఓ ముఖ్యపాత్ర పోషించనుందట. ఈ విషయాన్ని కేట్ విన్స్ లెట్ హాలీవుడ్ మీడియాకు ఇవాళ ఉదయం ప్రకటించింది. తనను హాలీవుడ్ కి పరిచయం చేసిన జేమ్స్ దర్శకత్వంలో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నటించనుండడం, అది కూడా “అవతార్ 2” సినిమా కావడం తనకు గర్వంగా ఉందని కేట్ తెలిపింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus