బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. కొద్దిరోజులుగా కత్రినా.. తన ప్రియుడు విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ దీపావళి వేడుకల్లో నిర్మాత ఆర్తీశెట్టి ఇంటి వద్ద కత్రినా-విక్కీ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా నివేదికల ప్రకారం.. త్వరలోనే ఈ ప్రేమ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారని.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా రహస్యంగా చేసుకుంటున్నారని తెలుస్తోంది.
డిసెంబర్ 7 లేదా 9 తేదీల్లో రాజస్థాన్ లో వీరి పెళ్లి జరగబోతుందని వార్తలు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తమ వెడ్డింగ్ ప్లేస్ విషయం బయటకు రావడంపై కత్రినా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మరే విషయాలు లీక్ కాకుండా ఉండాలని.. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఇంకా ఎవరికీ పంపడం లేదట. రీసెంట్ గా విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్.. కత్రినాకు దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు కూడా తెలుస్తోంది.
దీంతో విక్కీ కుటుంబం నుంచి కత్రీనాకు షాగున్ (ప్రత్యేక బహుమతి) అందిందంటూ బీటౌన్ లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. కత్రినా కైఫ్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదిహేనేళ్ల నుంచి తన పెళ్లి వార్తలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయని.. నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారంటూ ఇటీవలే కంత్రీనా మండిపడింది. అయినప్పటికీ.. ఇప్పుడు తన పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!