Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?
- July 23, 2026 / 09:28 PM ISTByPhani Kumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం 2 భారీ బడ్జెట్ అలాగే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అందులో ఒకటి ‘ఫౌజీ’. మరొకటి ‘స్పిరిట్’. ఈ 2 సినిమాల్లో ఎక్కువ హైప్ గెయిన్ చేసిన సినిమా ‘స్పిరిట్’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా అని ‘ఫౌజీ’ని తక్కువ చేయడానికి లేదు. ఇటీవల వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ తో ‘ఫౌజీ’ పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. అది పక్కన పెట్టేస్తే.. ‘స్పిరిట్’ కి కల్ట్ క్రేజ్ ఉందనేది వాస్తవం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.
Spirit Movie
2027 మార్చి లో రిలీజ్ కాబోతోంది. కెరీర్లో మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. ‘స్పిరిట్’ గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కథలో భాగంగా మరో హీరోయిన్ కి కూడా స్పేస్ ఉందట. దాని కోసం ఓ సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.

ఆమె మరెవరో కాదు కత్రినా కైఫ్. దాదాపు ఆమె ఫైనల్ అయ్యిందని ఇన్సైడ్ టాక్. వాస్తవానికి ఈ సినిమాకి దీపికా పదుకోనె మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె తప్పుకోవడం.. ఆమె ప్లేస్ లో త్రిప్తిని తీసుకోవడం జరిగింది. ఇక కత్రీనా విషయంలో ‘స్పిరిట్’ మేకర్స్ అధికారికంగా ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.
‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!















