Katrina Kaif: తన సీక్రెట్ మ్యారేజ్ పై స్పందించిన కత్రీనా కైఫ్!

Advertisement

గత ఏడాది అంటే.. 2021 నవంబర్ 9న బాలీవుడ్ లవ్ బర్డ్స్ లో ఒకరైన కత్రినా కైఫ్-విక్కీ కౌశల్… వివాహ బంధంతో ఒకటయ్యారు. చాలా కాలం డేటింగ్ తర్వాత వీరు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా లో వీరి పెళ్లి వేడుకలు తక్కువ మంది సమక్షంలోనే ఘనంగా జరిగాయి. ఇదిలా ఉండగా..

వీరి పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన చేయకుండానే చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది కత్రీనా- విక్కీ కౌశల్ ల జంట. అంత సీక్రెట్ గా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటూ చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ జంట ఆ అనుమానాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తర్వాత జనాలు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. అయితే ఇన్నాళ్టికి కత్రీనా ఈ విషయాల పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

‘కరోనా కారణంగానే మా పెళ్లి గురించి ఎవ్వరికీ చెప్పలేదు. కరోనా టైంలో మా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది.మేము చాలా భయాందోళనకు గురయ్యాము. అందుకే సింపుల్ గా మా కుటుంబ సభ్యుల సమక్షంలోనే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాము’ అంటూ కత్రీనా చెప్పుకొచ్చింది. పెళ్ళికి ముందుకు కత్రీనా- విక్కీ కౌశల్ ల జంట ప్రైవేట్ పార్టీలకు తెగ తిరిగారు.

కానీ వీళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఉండడంతో.. ‘సినిమా ప్రమోషన్లో భాగంగానే వారు ఇలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని’ అంతా లైట్ తీసుకున్నారు. కానీ కట్ చేస్తే వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్ కు గురయ్యారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus