విక్టరీ వెంకటేష్ మల్లీశ్వరి సినిమాలో యువరాణిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. అల్లరి పిడుగులో బాలకృష్ణతో పాటు స్టెప్పులు వేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా ఏమీ చేయలేదు. అయితే హిందీలోనే స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ముప్పై నాలుగు ఏళ్ల ఈ నటి పెళ్ళికి సిద్ధమైంది. ఎరుపు రంగు పట్టు చీర కట్టుకుని… పెద్ద బొట్టుతో పెళ్లికూతురిగా కత్రినాని చూసినవారు దిష్టి తగులుతుందేమోనని అనుకున్నారు. కత్రినా అంతలా రెడీ అయింది.. నిజమైన పెళ్లికోసం కాదు… సినిమా కోసం. ప్రస్తుతం షారుక్ ఖాన్ చేస్తోన్న‘జీరో’ సినిమాలో కత్రినా హీరోయిన్ గా నటిస్తోంది.
ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ మరుగుజ్జు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పెళ్లి కూతురుగా కత్రినా అందంగా ముస్తాబయింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ఆజా ఫర్ జీరో” అంటూ కామెంట్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫోటోకి లైకులు విపరీతంగా వస్తున్నాయి. పొట్టి డ్రసులతో కనిపించే కత్రినాను ఇలా చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. నిజజీవితంలో ఇలా ఎప్పుడు రెడీ అవుతావని అడుగుతున్నారు. బాలీవుడ్ లో పెళ్లి ఈడు దాటిపోతున్న హీరోయిన్స్ జాబితాలో కత్రినా ముందు వరుసలో ఉంది. మరి ఆ శుభవార్తను ఎప్పుడు చెబుతుందో చూడాలి.