Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Kattalan Review in Telugu: కాటాలన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kattalan Review in Telugu: కాటాలన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 28, 2026 / 08:25 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Kattalan Review in Telugu: కాటాలన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఆంటోనీ వర్గీస్ (Hero)
  • దుషారా విజయన్ (Heroine)
  • సునీల్, కబీర్ దుహాన్ సింగ్,రాజ్ తిరందాస్, సిద్ధిఖీ,జగదీష్ తదితరులు (Cast)
  • పాల్ జార్జ్ (Director)
  • షరీఫ్ మహమ్మద్ సిఐజి (Producer)
  • రవి బసృర్ (Music)
  • రణదివే (Cinematography)
  • షామీర్ మహమ్మద్ (Editor)
  • Release Date : మే 28 2026
  • క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ (Banner)

గత 2,3 ఏళ్ళుగా మలయాళ సినిమాలని కూడా తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. వాటికి ఎంతో కొంత కలెక్షన్లు కట్టబెడుతున్నారు. అందుకే అనుకుంట మలయాళ ఫిలిం మేకర్స్ టైమ్ సరిపోయినా.. లేకపోయినా తమ ప్రతి సినిమాని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ వారం ‘కాటాలన్’ (Kattalan) అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్ వంటి తెలుగు స్టార్ ఇందులో విలన్ గా చేయ\డం ఆకర్షించే అంశం. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

Kattalan Movie Review and rating in telugu

కథ : కర్ణాటక-కేరళ బోర్డర్లో బందిపూర్ అనే దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ లభించే ఏనుగు దంతాలకి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఒక్కో ఏనుగు దంతం ఏకంగా రూ.3.5 కోట్లు పలుకుతుంది. మార్కెట్ వాసులు వీటిని ‘ఎ-గ్రేడ్’ సరుకుగా, ‘వైట్ గోల్డ్’గా (తెల్ల బంగారం) భావిస్తారు.దీంతో ఆ అడవిలో నివసించే గిరిజన జనాలను బానిసలుగా మార్చుకుని, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌ను విచ్చలవిడిగా విస్తరిస్తాడు మారి (సునీల్). ఈ స్మగ్లింగ్ ప్రపంచంలో ఒక డాన్‌లా అవతరించి, ఆ కార్టెల్‌కు కింగ్ అవుతాడు. తన వ్యాపారానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరినీ కిరాతకంగా చంపేస్తూ ఉంటాడు. ఊరి జనాలు ఎవరైనా ఎదురుతిరిగితే, వాళ్ళ ఇంట్లో ఉండే చిన్న(ఆడ) పిల్లలపై అత్యాచారాలకి పాల్పడుతూ.. ఆ జనాలని గుప్పిట్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు.అయితే, మరోవైపు మారి బిజినెస్‌ను దెబ్బకొట్టి ఆ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పరితపిస్తూ ఉంటాడు ఎడ్డీ(కబీర్ దుహాన్ సింగ్). దీని కోసం రాజకీయంగా బలాన్ని పెంచుకుని, మారి బిజినెస్‌ను ఒకటి రెండు సార్లు గట్టిగానే దెబ్బతీస్తాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మారికి అండగా నిలబడి, అతని బిజినెస్‌ను ఆదుకుంటాడు ఆంటోనీ (ఆంటోనీ వర్గీస్). అంతేకాదు, మారి నమ్మకాన్ని గెలుచుకుంటూనే.. మరోవైపు ఆ ఊరి జనాలకి సైతం ఆంటోనీ దగ్గరవుతాడు.

ఒకానొక టైంలో మారి కోసం ఎడ్డీ తమ్ముడైన రాబీని ఆంటోనీ చంపాల్సి వస్తుంది.కానీ, కాలక్రమేణా మారి చేస్తున్న అరాచకాలను చూసి తట్టుకోలేక, ఆ ఊరి జనాల కోసం మారికి ఎదురుతిరుగుతాడు ఆంటోనీ. అంతేకాకుండా ఆ ఊరి జనాల కోసం ఓ ఏనుగుని చంపేసి.. ఆ రెండు ఏనుగు దంతాలను శ్రీలంకకు తీసుకెళ్లి అమ్ముకొస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మారి ఆంటోనీపై అలాగే ఆ ఊరి జనాలపై ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? ఊరి జనాలను మారి బారి నుండి ఆంటోనీ ఎలా కాపాడాడు? అందుకు లూసీ చేసిన సాయం ఏంటి? అసలు ఆంటోనీ వెనుక ఉన్న గతం ఏంటి? ఎడ్డీ ఏమయ్యాడు? అనేది మిగిలిన కథ

Kattalan Movie Review and rating in telugu

నటీనటుల పనితీరు : మలయాళం సినిమాలని ఓటీటీల్లో ఎక్కువగా చూసే జనాలకి ఆంటోనీ వర్గీస్ సుపరిచితమే. ‘కాటాలన్’ లో హీరో పాత్రకి బాగానే సెట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ లో బాగా చేశాడు. కాకపోతే ఇంకాస్త స్లిమ్ అయ్యి ఉంటే బాగుండేది. ఎందుకో లిప్ మూమెంట్ కూడా సెట్ అవ్వలేదు. సునీల్ మారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. కానీ పాత్రలో అయితే కొత్తదనం ఏమీ లేదు. ‘పుష్ప’ లో చేసిన మంగళం శీను పాత్రనే తలపిస్తుంది ఈ సినిమాలో సునీల్ చేసిన మారి పాత్ర. ‘మార్కో’ నిర్మాతలు కాబట్టి.. ఈ పాత్రకి క్రూరత్వాన్ని కూడా జోడించారు. సిద్దిఖీ పాత్ర ఫోన్లో మాట్లాడటానికే పరిమితం చేశారు. ‘పుష్ప’ లో సునీల్ బావమరిది పాత్ర చేసిన రాజ్ తిరందాస్ పాత్ర కూడా ఇందులో బాగుంది. కబీర్ దుహాన్ సింగ్ పాత్రలో కూడా కొత్తదనం లేదు. కానీ అతని భారీ కటౌట్ కారణంగా నిండుగా కనిపించాడు. దుషారా విజయన్ ‘వీర ధీర శూర’ ‘వేట్టయన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. అయితే ‘కాటలాన్’ లో ఆమె యాక్షన్ యాంగిల్ చూపించింది. ఈ సినిమాతో ఆమె భారీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా చేయగలను అని ప్రూవ్ చేసింది.సినిమాలో ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి కానీ.. అవి పెద్దగా ఇంప్రెస్ చేయవు.

Kattalan Movie Review and rating in telugu

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘కాటాలన్’ కథ పరంగా తెలుగు ప్రేక్షకులకి ఏమాత్రం కొత్త ఫీల్ కలిగించదు. దర్శకుడు పాల్ జార్జ్ ‘పుష్ప’ ‘కేజీఎఫ్’ ‘సలార్’ సినిమాల స్పూర్తితో ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ‘పుష్ప’ లో హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు. ‘కాటాలన్’ లో హీరో ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తాడు. విలన్ తో హీరో కాంట్రడిక్షన్ సీన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఊరి జనాల కోసం హీరో విలన్(మారి) మనుషులకి అడ్డం తిరిగిన సన్నివేశాలు మనకి ‘సలార్’ ‘ఛత్రపతి’..లని గుర్తుచేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో చాలా పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. కానీ ఏ పాత్ర ఎవరిదో.. తెలుసుకోవడానికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది అంటే అతిశయోక్తి అనిపించుకోదు. సెకండాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంత బెటర్. దుషారా విజయన్ పాత్ర ఎంటర్ అయినప్పటి నుండి కథనం కొంచెం స్పీడ్ అందుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. మలయాళ సినిమాలు అంటేనే మంచి టెక్నికల్ వర్క్ కి పెట్టింది పేరు.. అని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.

Kattalan Movie Review and rating in telugu

విశ్లేషణ : ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘పుష్ప’ ‘కేజీఎఫ్’ ‘సలార్’/’ఛత్రపతి’ సినిమాలను మిక్స్ చేస్తే ‘కాటాలన్’ రూపొందింది అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా కొత్తగా ఏమీ అనిపించదు. టెక్నికల్ గా రిచ్ గా ఉన్నప్పటికీ.. ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడంతో ‘కాటాలన్’ అలరించలేకపోయింది.

ఫోకస్ : బోరింగ్ యాక్షన్ డ్రామా

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kattalan

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

4 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

10 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

1 day ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version