Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 15, 2026 / 06:07 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ధృవ్ సార్జా (Hero)
  • రీష్మా నన్నయ్య (Heroine)
  • సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్,వి.రవిచంద్రన్,కిచ్చ సుదీప్,బొమ్మాళి రవి తదితరులు (Cast)
  • ప్రేమ్ (Director)
  • వెంకట్ కె నారాయణ (Producer)
  • అర్జున్ జన్య (Music)
  • విలియం డేవిడ్ (Cinematography)
  • సంకేత్ ఆచార్ (Editor)
  • Release Date : 15th మే 2026
  • కె వి ఎన్ ప్రొడక్షన్స్ (Banner)

అర్జున్ మేనల్లుడుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ధృవ్ సార్జా.. కన్నడలో యాక్షన్ ప్రిన్స్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. అతను చేసే ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘పొగరు’ కొద్దిపాటి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. దాని తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఆడియన్స్ కి గుర్తులేదు అనే చెప్పాలి. ఇక అతని లేటెస్ట్ మూవీ ‘KD’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో అయినా ధృవ్ కి తెలుగులో మార్కెట్ ఓపెన్ అవుతుందా? తెలుసుకుందాం రండి :

KD: The Devil Movie Review

KD The Devil Movie Review and Rating

కథ: 1970 లలో జరిగే కథ ఇది. ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ సూరప్ప(బొమ్మాళి రవిశంకర్) ఇంట్లో పెళ్లి జరుగుతుంటుంది. అదే టైంలో అతనికి అలాగే అతని కుటుంబానికి ప్రాణహాని ఉందని భావించి.. ప్రభుత్వం సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కారణాలు వివరిస్తూ.. అందరినీ గతంలోకి తీసుకెళ్తాడు సూరప్ప. ఇక గతంలోకి వెళితే.. కాళిదాస్(ధృవ్ సార్జా) అనే ఓ కిరోసిన్ వ్యాపారి ఉంటాడు. అతనికి తన ఫ్యామిలీ అంటే ప్రాణం. కాళి సరిగ్గా చదువుకోలేదు అనే ఒక్క కారణంతో అతని అన్న ధర్మ(రమేష్ అరవింద్).. కాళిని దూరం పెడతాడు. అన్న ఒక్కసారైనా మాట్లాడితే బాగుణ్ణు అనే ఆశతో బ్రతుకుతుంటాడు కాళి. మరోవైపు అతనికి కుస్తీ ఫైటర్, రౌడీ షీటర్ అయినటువంటి దేవా(సంజయ్ దత్) అంటే విపరీతమైన అభిమానం. ఎందుకంటే కాళి చిన్నతనంలో ఒక యాక్సిడెంట్ కి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. దేవా అతన్ని హాస్పిటల్లో చేర్పించి బ్లడ్ ఇచ్చి మరీ కాపాడతాడు.

ఆ కృతజ్ఞతతో దేవాకి దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు కాళి. ఈ క్రమంలో దేవా ఒకసారి తన భార్య సత్యవతితో(శిల్పాశెట్టి) సినిమాకి వెళితే.. అక్కడ కొంతమంది రౌడీలు ఎటాక్ చేస్తారు. దేవా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కాళి సాయం చేసి కాపాడతాడు. అదే సమయంలో కాళి లక్ష్మీ( రీష్మా నన్నయ్య) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఒకసారి తన ప్రేయసి కారణంగా దేవాకి టార్గెట్ అవుతాడు కాళి. ఆ తర్వాత కాళిని అలాగే అతని కుటుంబాన్ని చంపేయాలని డిసైడ్ అవుతాడు. దేవా బారి నుండి కాళి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? కాళి అనే ఓ సాధారణ కిరోసిన్ వ్యాపారి వల్ల దేవాకి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ.

KD The Devil Movie Review and Rating

నటీనటుల పనితీరు: ధృవ్ సార్జా ఇంకా పెర్ఫార్మర్ గా నిలదొక్కుకోలేదు. నటనకి స్కోప్ ఉన్న సినిమాలు కూడా చేయడం లేదు. ‘KD’ లో ధృవ్ సార్జాని యాక్టర్ గా నిలబెట్టే అంశాలు ఏమీ లేవు. కానీ సెకండాఫ్లో అది కూడా క్లైమాక్స్ లో ఒక రెయిన్ ఫైట్ ఉంటుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్లో మాత్రం ధృవ్ బాగా చేశాడు. అంతకు మించి ధృవ్ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. ఇక హీరోయిన్ రీష్మా చేసిన అతి మరువలేనిది అనే చెప్పాలి. వీళ్ళ లవ్ ట్రాక్ పేరు చెప్పి.. ఫస్ట్ హాఫ్ అంతా అక్కడే నడిపించాడు దర్శకుడు. అందువల్ల ఇంటర్వెల్..కే ఆడియన్స్ థియేటర్ నుండి నిష్క్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదు. సంజయ్ దత్ మాత్రం మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. రమేష్ అరవింద్, వి.రవిచంద్రన్ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ.. వాళ్ళ నుండి దర్శకుడు సరైన పెర్ఫార్మన్స్ రాబట్టుకోలేదు. పైగా ఆ పాత్రలకి సరైన కన్క్లూజన్ కూడా ఇవ్వలేదు. శిల్పా శెట్టి ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించింది అంతే..! అంతకు మించి ఆమె పాత్ర గురించి గొప్పగా చెప్పుకోవడానికేమీ లేదు. కిచ్చ సుదీప్ కేమియో ఏదో కావాలని పెట్టినట్టు ఉంది.

KD The Devil Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు’ అనే సామెత ఉంది. కొన్నాళ్లుగా కన్నడలో రూపొందుతున్న సినిమాలు చూస్తుంటే.. ఈ సామెత వారికి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే.. ‘కె జి ఎఫ్’ అనేది కన్నడ సినీ పరిశ్రమకి ఓ గేమ్ ఛేంజింగ్ మూవీ. దాని తర్వాత కన్నడ సినిమాలకి పక్క రాష్ట్రాల్లో కూడా ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో వచ్చిన ‘కాంతార’ వంటి సినిమాలు బాగా ఆడాయి. కానీ అక్కడి మేకర్స్ కి, నిర్మాతలకు కేజీఎఫ్ లాంటి సక్సెస్ కొట్టాలనే తపన ఎక్కువైంది అనే చెప్పాలి. పెద్ద బడ్జెట్ సినిమాలు అంటే కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ తో నింపేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టు ఉన్నారు. ‘KD’ సినిమాతో అది నిజమే అని మరోసారి ప్రూవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్లో బొమ్మాళి రవిశంకర్ పాత్రని బ్యాక్ స్టోరీ చెప్పడానికి వాడుకున్నారు. ఫ్లాష్ బ్యాక్లో కూడా అతని పాత్ర ఉంటుంది. కానీ అతని హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ ‘అతి’కి పరాకాష్ఠలా అనిపిస్తాయి. మధ్య మధ్యలో అతని ఫ్యామిలీ మెంబర్స్ పలికించే ఎమోషన్ వంటివి చూస్తే.. దర్శకుడు ప్రేమ్ పై కేజీఎఫ్ ప్రభావం ఎక్కువగానే పడింది అనిపించకమానదు. ఫస్ట్ హాఫ్ లో కథేమీ ఉండదు.

అందువల్ల ఆడియన్స్ కి సెకండాఫ్ పై ఆసక్తి కలగదు. ఇక సెకండాఫ్లో ఏమైనా కథ మొదలవుతుందా అంటే అదీ లేదు. క్లైమాక్స్ లో వచ్చే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇంత సాగదీశారా? అనిపిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ అయిపోయాక కూడా ఒక పాట పెట్టి ఆడియన్స్ సహనానికి మరింత పరీక్ష పెట్టారు అని చెప్పాలి. ఆ తర్వాతైనా సినిమా అయిపోయిందా అంటే అదీ లేదు. అర్ధం పర్థం లేని ఒక ట్విస్ట్ పెట్టి.. సీక్వెల్ అంటూ టైటిల్ కార్డు వేశారు. అది చూశాక ఆడియన్స్ మరింత ఇరిటేట్ అవ్వడం ఖాయం. టెక్నికల్ గా చెప్పుకునేంత గొప్పగా సినిమాలో ఏవీ లేవు. ఆ రెయిన్ ఫైట్ ని కంపోజ్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ కి మాత్రమే పాస్ మార్కులు పడతాయి.

KD The Devil Movie Review and Rating

విశ్లేషణ: మొన్నామధ్య వచ్చిన విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అందులో దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ నటుడు..’సార్ నా దగ్గర ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన కథ మాత్రమే ఉంది. ఏం చేయమంటారు?’ అంటూ అడుగుతాడు. అందుకు హరీష్ శంకర్.. ‘ఒక పనిచేయ్. ఆ ఫస్ట్ హాఫ్ ని ఫస్ట్ పార్ట్ గా తీసేసి రిలీజ్ చెయ్యి. హిట్ అయ్యిందనుకో నీదో యూనివర్స్. ప్లాప్ అయ్యిందనుకో నువ్వో బేవార్స్’ అంటూ బదులిస్తాడు. ‘KD’ కూడా అదే కోవలోకి వస్తుంది. థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా ఈ సినిమాని చూసి తట్టుకోవడం కష్టమే..!

KD The Devil Movie Review and Rating

ఫోకస్ పాయింట్: ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే ‘KD’

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Sarja
  • #KD: The Devil Movie
  • #Reeshma
  • #Sanjay Dutt
  • #Shilpa Shetty

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

trending news

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

31 mins ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

21 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

23 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 days ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version