KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Advertisement

పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తాం అంటూ సినిమా ప్రారంభం సమయంలో చెబుతున్నారు, సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు.. ప్రచారం చేసేటప్పుడు అదే మాట చెబుతున్నారు. తీరా సినిమా రిలీజ్‌ దగ్గరకు వచ్చేసరికి ఆ సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌లో రావడం లేదు. ఏ భాషలో తొలుత నిర్మిస్తున్నారో అందులో మాత్రమే రిలీజ్‌ చేస్తున్నారు. ఒకవేళ ఇతర భాషల్లో రిలీజ్‌ చేసినా పెద్దగా ప్రభావం ఉండటం లేదు. కారణాలేంటో తెలియదు కానీ ఇలాంటి సినిమాలు ఈ మధ్య కనిపిస్తున్నాయి.

KD The Devil

ఇప్పుడు ఓ కారణంతో పాన్‌ ఇండియా సినిమా కస్తా పాన్‌ కన్నడ సినిమాగా మాత్రమే మిగిలిపోయింది. అదే ‘సర్కే చునార్‌..’ అనే హిందీ పాటతో కాంట్రవర్శీ ఎదుర్కొని, వైరల్‌ అయిపోయిన కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్‌’. ధ్రువ్‌ సర్జా కథానాయకుడిగా ప్రేమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 30న కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ గురువారం ఈ సినిమా కన్నడలో మాత్రమే విడుదలైంది.

డబ్బింగ్‌ వెర్షన్స్‌కు సంబంధించి సెన్సార్‌ నుంచి అనుమతులు రాకపోవడంతో అనుకున్న సమయానికి ఇతర భాషల్లో ‘కేడీ’ సినిమా రాలేకపోయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 7న ఇతర భాషల్లో రిలీజ్‌ చేస్తారట. కన్నడ వెర్షన్‌కు సంబంధించి సెన్సార్‌ బోర్డు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందట. ఆ వెర్షన్‌కు సంబంధించి సెన్సార్‌ పూర్తవకుండా ఇతర భాషలకు పంపడానికి వీల్లేదు. దీంతో కేవలం కన్నడలో మార్పులు చేసి రిలీజ్‌ చేశారట.

ఈ సినిమాను కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన విషయం తెలిసిందే. వాళ్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ‘జన నాయగన్‌’ సినిమా సెన్సార్‌ చిక్కుల్లో పడింది. అదింకా తేలలేదు అంటే ‘కేడీ: ది డెవిల్‌’ సినిమా ‘సర్కే చునార్‌’ చిక్కుల్లో పడింది. ఈ కారణాలో లేక ఇంకేమైనా ఉన్నాయో కానీ ఎప్పుడో ప్రారంభం కావాల్సిన చిరంజీవి – బాబీ సినిమా ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు. ఇటీవల లుక్‌ టెస్ట్‌ అయితే చేశారు.

10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus