మహానటి చిత్రం కోసం కీర్తి ఎంత తీసుకున్నారు ?

అభినేత్రి సావిత్రి తన నటనతో తెలుగు, తమిళ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్నారు. ఆమెలా నటించడమంటే అంతతేలికైన విషయం కాదు. ఇక ఆమెగానే నటించడమంటే చాలా దైర్యం కావాలి. అలా దైర్యంగా కీర్తి సురేష్ ముందడుగు వేసింది. కట్టు, బొట్టులోనే కాదు.. రియల్ లైఫ్, రీల్ లైఫ్ లలో సావిత్రిలా నటించి అందరినీ మెప్పించింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మంచి కలక్షన్స్ రాబడుతోంది. వారం కూడా పూర్తికాకముందే ఈ మూవీ ఓవర్సీస్ 1 .5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ చిత్రానికి కీలకంగా నిలిచినా కీర్తి ఎంత తీసుకున్నారని? ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.

ఈ ఒక్క సినిమాకి ఒకటిన్నర కోటి తీసుకున్నట్టు సమాచారం. అనుష్క, నయనతార, కాజల్, సమంత.. వీరు మాత్రమే ఇప్పటివరకు సినిమాకి కోటీకి పైగా తీసుకున్నారు. వీరందరూ సీనియర్ హీరోయిన్స్. అయితే పరిశ్రమకి వచ్చి అతి తక్కువ సమయంలో కోటికి మించి రెమ్యునరేషన్ అందుకొని కీర్తి ఔరా అనిపించింది. ఇక నుంచి ఇతర సినిమాలకు కూడా ఇదే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందా? లేకుంటే .. తక్కువగానే తీసుకుంటుందా? అని దర్శకనిర్మాతలు మాట్లాడుకుంటున్నారు. ఏదిఏమైనా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ మూవీని చూసి తెలుగువారందరూ గర్వపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus