అజయ్ దేవగన్ తో కీర్తి సురేష్ రొమాన్స్…?

ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి సురేష్. ఇప్పటికే విజయ్,విక్రమ్, సూర్య, విశాల్, శివ కార్తికేయన్ వంటి హీరోల పక్క నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలో కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ నడుస్తుంది. రజినీకాంత్ 166 చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేయబోతున్నాడు. మురుగదాస్ గత చిత్రం ‘సర్కార్’ లో కూడా కీర్తినే హీరోయిన్ గా నటించింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో కూడా ఆమెనే ఎంచుకున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్… త్వరలోనే బాలీవుడ్ లో అడుగుపెట్టబోతుందట.

వివరాల్లోకి వెళితే హిందీలో.. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కీర్తి హీరోయిన్ గా ఎంపికయ్యిందట. ‘బధాయి హో’ లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు అమిత్ శర్మ .. బోని కపూర్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుందట.అందుతున్న సమాచారం ప్రకారం… ఫుట్ బాల్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ జీవిత ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందట. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించనుందని తెలుస్తుంది. జూన్ మొదటి వారం నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తుంది. మంచి కథా బలం ఉన్న చిత్రం కాబట్టి… తొలి చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకోవడం ఖాయమని ఫిలిం విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus