జూన్ 8న విడుద‌ల కాబోతున్న కీర్తి సురేష్ పెంగ్విన్ టీజ‌ర్

మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ అప్ క‌మింగ్ మూవీ పెంగ్విన్ ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఎక్స్ క్లూజివ్ గా జూన్ 19న విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ టు రిలీజ్ స్లాట్ లో త‌మ‌ స‌బ్ స్క్రైబర్స్ కు అందిస్తోంది. మ‌హాన‌టి త‌రువాత కీర్తి సురేష్ న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం కావ‌డంతో పెంగ్విన్ పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు విడుద‌ల చేసిన పెంగ్విన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న ల‌భించింది.

దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పెంగ్విన్ టీజ‌ర్ ను జూన్ 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకం పై ద‌ర్శ‌కుడు, నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈశ్వ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus