కీర్తి సురేష్ తో మళ్ళీ కలిసి నటించనున్న సీనియర్ నటులు
- March 20, 2019 / 06:42 PM ISTByFilmy Focus
మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల “118”తో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా.. ఈ సినిమా క్యాస్ట్ ను ఫైనల్ చేశారు.
- ‘హిప్పీ’ టీజర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మరో వివాదంలో ‘దండుపాళ్యం’ హీరోయిన్..?
- విలన్ గా నటించబోతున్న తమన్నా..?
- 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో రానా…?

“మహానటి” చిత్రంలో కీర్తి సురేష్ పెంపుడు తండ్రిగా కీలకపాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్.. అలాగే అదే సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషించిన నరేష్ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రా, నడియాలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. క్యాస్ట్ ను బట్టి సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. మరి సినిమా జోనర్ ఏమిటి అనేది తెలియాలంటే కనీసం టీజర్ వచ్చేవరకైనా వెయిట్ చేయాల్సిందే.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















