వైష్ణవ్‌తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా’ చేసి.. ఇప్పుడు సాయి ధరమ్‌తేజ్‌తో ‘బ్రో’లో నటించి దాదాపు మెగా హీరోయిన్ అయిపోయింది కేతిక శర్మ. సరైన విజయాలు లేకపోయినా గ్లామర్ షోతో అవకాశాలు సంపాదించింది. అయితే ఇప్పుడు కొత్త సినిమాలు ఏవీ లేవు అనుకోండి. ఈ క్రమంలో ఆమె ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. దీంతో కామన్‌గా ఎదురయ్యే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ ఇచ్చేసింది. దీంతో ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ కామన్ ప్రశ్న ఏంటంటే.. ఇద్దరు అన్నదమ్ములతో నటించారు కదా… ఎవరు ఎలాంటి వాళ్లు. అన్నదమ్ములతో యాక్ట్ చేసిన హీరోయిన్ ఎదురుపడితే ఈ ప్రశ్న అడగడం కామన్. అలానే అడిగితే.. కేతిక చాలా వివరంగా చెప్పుకొచ్చింది. వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరూ సరదాగానే ఉంటారు కానీ, ఇద్దరివీ భిన్నమైన వ్యక్తిత్వాలు అని చెప్పింది. వైష్ణవ్‌కి మొహమాటం ఎక్కువట. కాస్త మాటలు, చనువు పెరిగాక సరదాగా ఉంటాడట. సాయిధరమ్ తేజ్ అయితే అందరితో కలివిడిగా ఉంటాడట. సెట్స్‌లో జోక్లేస్తూ కలిసిపోతుంటాడట.
అంతేకాదు ‘రంగ రంగ వైభవంగా’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడే ‘బ్రో’ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఇక మీరు ఎలాంటి సినిమాల్లో నటించాలి అనుకుంటున్నారు అనే రెగ్యులర్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పడితే.. దానికి ఆమె ఇంకా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది. జీవిత చరిత్రలతో రూపొందే సినిమాల్లో నటించాలని ఉందట కేతికకు. అంతే కాదు తాను స్వతహాగా స్విమ్మర్నని.. అందుకే స్విమ్మింగ్ నేపథ్యంలో అవకాశం వస్తే తప్పక నటిస్తాను (Ketika Sharma) అని చెప్పింది.
కాబట్టి రైటర్లు, దర్శకులు ఎవరైనా స్విమ్మర్ల లైఫ్‌తో సినిమా చేయాలి అనుకుంటే మీకు ఇన్‌స్టంట్‌గా మెయిన్ లీడ్ దొరికేసినట్లే. కొత్త సినిమాల సంగతి చెప్పమంటే… ఆహా స్టూడియోస్‌లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్పింది కేతిక. అయితే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి అంతకుమించి వివరాలు చెప్పలేని అంది. గతంలో ఓసారి ఆహా కోసం కేతిక అల్లు అర్జున్‌తో కలసి ఓ యాడ్ చేసిన విషయం తెలిసిందే. అసలు సినిమాల సంగతి అయితే ‘బ్రో’ తర్వాతే నిర్ణయం తీసుకుంటాను అంటోంది.