గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసే యంగ్ బ్యూటీ కేతిక శర్మ, తన ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇటీవలే శ్రీ విష్ణు సరసన ‘సింగిల్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న టైమ్‌లో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. కారణం ఏంటో చెప్పకుండా, “త్వరలోనే తిరిగి వస్తా” అంటూ ఒక చిన్న నోట్ పెట్టింది. ఇన్‌స్టాలో 37 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న కేతిక, ఉన్నట్టుండి ఇలా బ్రేక్ తీసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
‘రాబిన్‌హుడ్’ సినిమాలో ‘అది ధా సర్‌ప్రైసు’ అంటూ ఐటెం సాంగ్‌తో రచ్చ చేసిన కేతిక, ఇప్పుడు తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె దృష్టి తమిళ ఇండస్ట్రీపై ఉందని, కొత్త ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ బ్రేక్ వెనుక కారణం కూడా కెరీర్‌పై మరింత దృష్టి పెట్టడమే కావొచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.ఆకాష్ పూరి సరసన ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కేతిక, ఇప్పటివరకు 7 సినిమాలు చేస్తే, అందులో 6 తెలుగులోనే నటించడం విశేషం.
అయినా, టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతోనే ఆమె కోలీవుడ్‌పై దృష్టి పెట్టిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రాజేష్ ఎం. సెల్వ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా, ఈ గ్లామరస్ బ్యూటీ ఓ సాలిడ్ తెలుగు రొమాంటిక్ హిట్‌తో తిరిగి వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.