ట్రాజెడీ ఎండింగ్ తో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’..?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యశ్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కె.జి.ఎఫ్’ ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ కి సరికొత్త డెఫినిషన్ అంటూ ఈ చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రేక్షకులు. కేవలం కన్నడలో మాత్రమే కాదు తెలుగు,హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఘాన విజయాన్ని నమోదు చేసింది. హీరో యశ్ ను చూపించిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ పేరుతో ఈ సీక్వెల్ రూపొందనుంది.

తాజాగా ఈ సీక్వెల్ కి సంబందించిన పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్ర షూటింగ్ ఇంకా మొదలవ్వక ముందే ఈ చిత్ర కథ ఇదేనంటూ రూమర్స్ మొదలయిపోయాయి.వారి కథనం ప్రకారం ఈ చిత్రంలో రాఖీ భాయ్(హీరో) కె.జి.ఎఫ్ గనులను స్వాధీనపరుచుకుని గరుడ(విలన్) స్థానాన్ని ఆక్రమిస్తాడట. అటుతరువాత శత్రువులంతా ఒక్కటై రాఖీ భాయ్ ని టార్గెట్ చేస్తారట. ఏది ఏమైనా క్లైమాక్స్ లో రాఖీ భాయ్ ను చనిపోతాడని చెప్పుకొస్తున్నారు.ఇటువంటి కథలకు అటువంటి ఎండింగే సెట్ అవుతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడని తెలుస్తుంది. అయితే హీరో చివరికి ఎలా చనిపోతాడు అనేది ఈ సీక్వెల్ లో కీలకం అని తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా కీలక పాత్రలు పోషిస్తుండడంతో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. ‘బాహుబలి ది బిగినింగ్’ తరువాత ‘బాహుబలి 2(ది కన్క్లూజన్ )కోసం ఎలా ఎదురు చూసారో అదే తరహాలో ఈ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus