Pushpa2: ‘పుష్ప2′ పై ఒత్తిడి పెంచుతున్న’కె.జి.ఎఫ్ 2’..!

  • April 26, 2022 / 12:27 PM IST

ఏ ముహూర్తాన ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు(సానా) ‘పుష్ప’ సినిమా 10 ‘కె.జి.ఎఫ్’ లతో సమానం అని చెప్పాడో అప్పటి నుండీ ‘పుష్ప’ తో ‘కె.జి.ఎఫ్’ ను కంపేర్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ‘పుష్ప’ కి మొదటి రోజు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ రేంజ్ లో అయితే ‘పుష్ప’ ఉండదు. ‘కె.జి.ఎఫ్’ సినిమాని ‘రంగస్థలం’ స్టైల్ లో తీసినట్టు ఉంటుంది. కానీ మన తెలుగు జనాలు తప్ప మిగిలిన వాళ్ళంతా ఈ మూవీని ఎగబడి చూసారు.

Click Here To Watch NOW

తెలుగు రాష్ట్రాల్లో తప్ప అన్ని ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను సాధించింది. ముఖ్యంగా హిందీలో అయితే ‘పుష్ప’.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ కలెక్షన్లను అధిగమించింది. దాంతో ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ హిట్ అయ్యింది కాబట్టి.. ‘పుష్ప2’ హిందీలో ‘కె.జి.ఎఫ్ 2’ కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. ‘కె.జి.ఎఫ్2’ లానే అల్లు అర్జున్‌- సుకుమార్ ల ‘పుష్ప2’ కూడా పాన్‌ ఇండియా లెవల్లో విడుదల అవుతుంది.

మరి రాఖీభాయ్‌ రేంజ్ లో ‘పుష్ప2’ లో పుష్ప రాజ్ పాత్ర ఉంటుందా? పవర్‌ఫుల్‌ ఎలివేషన్స్‌ ఉంటాయా? అసలు పుష్ప ఎర్రచందనం సిండికేట్‌ను ఎలా నడిపించాడు? భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ ,మంగళం శ్రీను, ల వల్ల పుష్ప ఫ్యామిలీకి ఏమైనా కష్టాలు వచ్చాయా?ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. పార్ట్ 1 లానే పార్ట్ 2 కూడా మంచి టాక్ ను కనుక రాబట్టుకుంటే భారీ కలెక్షన్లు అయితే నమోదవుతాయి.

కానీ ‘కె.జి.ఎఫ్2’ రేంజ్లో కలెక్ట్ చేస్తుందా అంటే అనుమానమే..! అంతేకాకుండా ‘కె.జి.ఎఫ్2’ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ రేంజ్లో కలెక్ట్ చేసింది.. చేస్తుంది. ‘పుష్ప 2’ ఇలా కలెక్ట్ చెయ్యాలి అంటే ఆ రేంజ్లో సుకుమార్ ఎలివేషన్స్ పెట్టాలి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus