KGF Chapter 2 Collections: రెండో వీకెండ్ ఓకె అనిపించిన ‘కె.జి.ఎఫ్ 2’ కలెక్షన్స్..!

Advertisement

2018లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్ 2’ ని తీర్చిదిద్దారు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజం, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ లకి తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో ‘కె.జి.ఎఫ్ 2’ కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

Click Here To Watch NOW

11 వ రోజున కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.కాకపోతే ఫస్ట్ వీకెండ్ లా ఈ వీకెండ్ కూడా భారీగా రాణించి బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనుకుంటే అలా జరగలేదు.

ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 38.61 cr
సీడెడ్ 10.25 cr
ఉత్తరాంధ్ర 6.74 cr
ఈస్ట్ 5.01 cr
వెస్ట్ 3.08 cr
గుంటూరు 4.04 cr
కృష్ణా 3.72 cr
నెల్లూరు 2.41 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 73.86 cr

‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.73.86 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది. అయితే ‘కె.జి.ఎఫ్ 2’ తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.1.14 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

రెండో వీకెండ్ కు పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. కాబట్టి కే.జి.ఎఫ్ భారీగా క్యాష్ చేసుకుంటుంది అనుకుంటే జస్ట్ డీసెంట్ అనిపించుకుంది. ‘ఆచార్య’ వచ్చేలోపు తెలుగులో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news