‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది అన్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కన్నడ సినిమాల్ని ఆ స్థాయిలో ఎవరు చూస్తారు. నిర్మాతలకు చేతులు కాలడం గ్యారెంటీ అని విమర్శించిన వారు సైతం లేకపోలేదు. కానీ కట్ చేస్తే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతి ఏరియాలో రెండింతలు లాభాలను అందించిన ఘనత సాధించింది. కొన్ని సెంటర్లలో అయితే 50 రోజులు కూడా ఆడింది. మాస్ ప్రేక్షకులు ఈ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు.
ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కి అంతకు మించి బ్రహ్మరథం పట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకి హిట్ టాక్ లభించింది కాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబట్టి సూపర్ హిట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.
ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
ఏపి + తెలంగాణ | 77.31 cr |
కర్ణాటక | 85.28 cr |
తమిళనాడు | 37.04 cr |
కేరళ | 24.27 cr |
హిందీ | 175.05 cr |
ఓవర్సీస్ | 80.45 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 479.40 cr కోట్లు(షేర్) |
థియేట్రికల్ బిజినెస్
ఏపి + తెలంగాణ | 74.00 cr |
కర్ణాటక | 100.00 cr |
తమిళనాడు | 35.00 cr |
కేరళ | 10.00 cr |
హిందీ | 100.00 cr |
ఓవర్సీస్ | 30.00 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 350 cr కోట్లు |
15 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.479.4 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవర్సీస్ ,కేరళ, తెలంగాణ, హిందీలో,తమిళ్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందించింది. కర్ణాటకలో,ఆంధ్ర లో ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవరాల్ గా అయితే ‘కె.జి.ఎఫ్ 2’ బ్రేక్ ఈవెన్ సాధించి రూ.129.4 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!