రాకీ భాయ్ స్టార్ట్ అయ్యాడు..!

యశ్ హీరోగా నటించిన ‘కె.జి.ఎఫ్’ చిత్రం ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ చిత్ర సీమలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. కేవలం కన్నడ లో మాత్రమే కాదు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్… హీరో యశ్ ను ఎలివేట్ చేసిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం చిత్రీకరణ సమయంలోనే ‘కె.జి.ఎఫ్’ ను రెండు భాగాలుగా తెరేక్కించనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో భాగం షూటింగ్‌ కూడా ప్రారంభించారు.

బెంగ‌ళూర్ లోని విజ‌య‌న‌గ‌ర్ ప్రాంతంలో ఉన్న‌ కొండండ్రం గుడిలో ‘కె.జి.ఎఫ్’ సీక్వెల్ కు సంబందించిన పూజా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్లతో పాటూ దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు. తొలి భాగం 200 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టిన ఈ చిత్ర సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారట.ఇందులో భాగంగా బాలీవుడ్ నటులను కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌లు ‘కె.జి.ఎఫ్’ సీక్వెల్ లో నటిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రం సీక్వెల్ కోసం అన్ని బాషల సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus