డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కే.జీ.ఎఫ్’..!

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కే.జీ.ఎఫ్’ మూడో వారంలో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. మూడో వీకెండ్ కి గాను 75 లక్షలు కాలేచ్ట్ చేసింది. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని దాదాపు రూ. 5 కోట్లకు ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి దక్కించుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారమే ఈ చిత్రం ఐదు కోట్లకు పైగా షేర్ రాబట్టి సేఫ్ గేమ్ లోకి వెళ్ళిపోయింది. ఇక 17 రోజులకు గానూ ‘కే.జీ.ఎఫ్’ చిత్రం రూ.10.29 కోట్ల షేర్ ను వసూల్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం 20 కోట్ల గ్రాస్ ను రాబట్టి ట్రేడ్ ను ఆశ్చర్యఅరిచింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను నమోదుచేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో యశ్ ను ఎలివేట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రంతో ఈ డైరెక్టర్ అలాగే హీరోకి మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. ఇక 17 రోజులకు గానూ ‘కేజీఎఫ్’ తెలుగు రాష్ట్రాల ఏరియా వైజ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజామ్: 4.14 cr
సీడెడ్: 1.95 cr


ఉత్తరాంధ్ర: 1.18 cr
ఈస్ట్ : 0.61 cr


వెస్ట్: 0.49 cr
కృష్ణ: 0.91 cr
గుంటూరు: 0.76 cr
నెల్లూరు: 0.24 cr

ఏపీ + తెలంగాణా: రూ. 10.28 cr (డిస్ట్రిబ్యూటర్ షేర్)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus