ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మహేష్ చిత్రం ఫిక్స్ ..?

మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 9 న కానుందని నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు వెల్లడించాడు. ఇక ఈ చిత్రం తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 26 వ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్లస్’ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరిస్తాడని సమాచారం.

ఇదిలా ఉండగా ‘కెజిఎఫ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి మహేష్ ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడంటూ ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది. వివరాల్లోకి వెళితే ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ పూర్తయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాడట. ఇందుకోసం తాజాగా మహేష్ సతీమణి నమ్రతని కలిసి ఓ స్టోరీ లైన్ కూడా వినిపించాడట. ఈ సినిమాను అన్ని భాషల్లో తెరకేక్కించనున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే ప్రశాంత్ ఇంకా పూర్తి కథను సిద్ధం చేయలేదట. ఒక లైన్ మాత్రం చెప్పడట. త్వరలోనే పూర్తి కథని సిద్ధం చేసి మహేష్ కి వివరిస్తాడంట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రాన్ని మహేష్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus