చిన్న సినిమాలకి కూడా పెద్ద సాయం చేస్తున్నాడు..!

‘కె.జి.ఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు కన్నడ హీరో యశ్. ఇక ‘కె.జి.ఎఫ్’ చిత్రం కన్నడలోనే కాకూండా మినీ ‘బాహుబలి’ లా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంత క్రేజ్ సంపాదించుకున్న హీరో యశ్ తాను బిజీగా ఉంటూనే మరోపక్క చిన్న సినిమాలకి కూడా తన వంతు సాయం చేస్తున్నాడు.

అసలు విషయం ఏమిటంటే.. కన్నడలో ‘గిర్మిట్’ అనే చిత్రం రూపొందుతుంది. ఇందులో అందరూ చైల్డ్ ఆర్టిస్టులే ఉంటారట. అయితే ఈ చిత్రంలో చిన్న పిల్లలు నటిస్తున్నప్పటికీ ఇందులో వాళ్ళు పోషించినవి పెద్దవాళ్ళ పాత్రలేనంట. ఇక ‘గిర్మిట్’ చిత్రం పక్కా కమర్షియల్ సినిమా అని తెలుస్తుంది. ఇందులో హీరో హీరోయిన్లకు యష్ మరియు భార్య కం హీరోయిన్ రాధికా పండిట్ డబ్బింగ్ చెప్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు హిందీలో ‘పక్కా మాస్’ పేరుతో అలాగే తమిళ్ మళయాలంలో ‘పొడి మాస్’ పేరుతో డబ్బింగ్ చేయనున్నారని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus