“ఛత్రపతి” సినిమా చూసినప్పుడు మన తెలుగు ఆడియన్స్ అందరూ ఒక రకమైన మాస్ హిస్టీరియాతో ఊగిపోయారు. ఇదిరా హీరోయిజం అంటూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తడంతోపాటు ప్రభాస్ స్టార్ డమ్ ను తీసుకెళ్లి ఆకాశానికి ఎత్తేశారు. ఆ సినిమా తర్వాత హీరోయిజంను మన దర్శకులు ఎంత లేపుదాం అని ప్రయత్నించినా.. పెద్దగా ఫలితం లేకపోయింది. ప్రభాస్ హైట్ & బాడీ లాంగ్వేజ్ ముందు మిగతా హీరోలందరూ పెద్దగా కనిపించలేదు. అయితే.. నిన్న విడుదలైన “కె.జి.ఎఫ్” మాత్రం మాస్ కి సరికొత్త నిర్వచనం పలికింది.
సినిమాలోని యాక్షన్ సీన్స్ & ఎలివేషన్ ఎపిసోడ్స్ చూస్తుంటే.. ఇది కదరా అసలు సిసలు మాస్ సినిమా అనిపించింది. కథ హైలైట్ అవ్వలేదనే మైనస్ పాయింట్ పక్కన పెట్టేస్తే.. సినిమాని మాస్ ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ గా సెకండ్ పార్ట్ కూడా విడుదలకు రెడీగా ఉండడంతో మూవీ లవర్స్ అందరూ ఆ సీక్వెల్ కోసం వెయిటింగ్. చూస్తుంటే.. యష్ కన్నడ చిత్రసీమతోపాటు యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ మీద చెరగని సంతకం చేసేలా ఉన్నాడు.