కేవలం ఫ్యాన్స్ కోసమే!!!

  • August 24, 2016 / 06:09 AM IST

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దాదాపుగా ఆ ఫ్యామిలీ నుంచి అరడజను పైగా హీరోలు ఉన్నారు. ఎవరికి వారు చిరు పుణ్యమా అని తమదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే అదే క్రమంలో చిరు సైతం టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసేసాడు. ఇక ఈమధ్య జరిగిన చిరు బర్త్‌డే వేడుకల్లో ఆ సినిమా టైటిల్ తో పాటు, మోషన్ పోస్టర్ సైతం రిలీజ్ చేసి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చాడు.

సూపర్, ఎక్సలెంట్ మెగాస్టార్, మెగా ఫ్యామిలీ అంతా అభిమానులను దాసోహమే…ఎవ్వరూ కాదనరు..కానీ అసలు విషయం ఏమిటంటే….కేవలం అభిమానుల కోసమే సినిమాలు తీస్తే సామాన్య ప్రేక్షకుడికి దూరం అయిపోతాం అని చిరు తెలుసుకోవాలి అన్న వాదన ఇప్పుడు వినిపిస్తుంది దానికి కారణం ఏంటి అంటే…మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలలో స్టార్ డైరెక్టర్ వినాయక్’ఖైదీ నెం.150′ మూవీలో ఓ డైలాగ్ చెబుతూ…’పొగరు నా ఒంట్లో వుంటుంది… హీరోయిజం నా ఇంట్లో వుంటుంది’  అన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా అభిమానుల కోసం ఇలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి అని సైతం చెప్పాడు.

అంతవరకూ బాగానే ఉంది కానీ, ఇదే సీన్…గతంలో కేవలం ఫ్యాన్స్ ని ఉద్ధేశించి తీసిన సినిమా గబ్బర్ సింగ్ అంటూ పవన్ తెలిపాడు….అంతేకాకుండా అభిమానుల కోసమే అన్నట్టుగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మేనరిజాలు పెట్టుకున్నారు. అంటే కట్ చేస్తే సినిమా పవన్ కరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్..అంతటితో అయిపోయిందా…మన చెర్రీ సినిమా బ్రూస్ లీ సైతం కేవలం ఫ్యాన్స్ కోసమే అన్నట్టు తెలిపాడు, ఏమయ్యింది అది  కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ అని అంది….మరి ఇప్పుడు అభిమానుల కోసం అని మెగాస్టార్ సైతం అంటున్నాడు…ఏమైనా తేడా వస్తే…కొన్ని కోట్ల అభిమానులకు నిరాశ తప్పదు…చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus