‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుకకు భారీ ఏర్పాట్లు

  • December 22, 2016 / 01:44 PM IST

తొమ్మిదేళ్ల తర్వాత అన్నయ్య సినిమా చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా పునః స్వాగతం పలికేందుకు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన150వ చిత్రం ‘ఖైదీ నెం150’ ఆడియో రిలీజ్ వేడుకకు విశేషంగా తరలి వచ్చి విజయవంతం చేయాలనీ భావించిన అభిమానులు, అది ఆగిపోవడంతో నిరాశ పడ్డారు. వచ్చే నెల మొదటివారంలో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని చిత్ర నిర్మాత రామ్ చరణ్ తేజ్  ప్రకటించగానే ఆనందించారు. చిరు అభిమాన సంఘాలు అన్నీ ఒకటై ఈ వేడుకలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పండగలా నిర్వహించాలని  ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలోని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటను యూట్యూబ్ లో ముందుగా రిలీజ్ చేసిన చిత్ర బృందం, పూర్తి పాటలను ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మెగా అభిమానులకు తన పాటలతో  మంచి విందు ఇవ్వనున్నట్లు తొలి పాటతోనే నిరూపించారు. మిగిలిన పాటలను వినేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ మూవీలో లక్ష్మీరాయ్ ఐటెం సాంగ్ లో అందాలను ఆరబోయనుంది. తమిళ హిట్ చిత్రం కత్తి కి రీమేక్ అయిన ఖైదీ నెం150’  సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus