సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో ఓ అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది ‘ఖలేజా’. 2010 అక్టోబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. త్రివిక్రమ్(Trivikram) – మహేష్ బాబు ‘అతడు’ (Athadu) వంటి కల్ట్ మూవీ(Khaleja) తర్వాత ఓ కొత్త పాయింట్ తీసుకుని ‘ఖలేజా’ చేశారు. 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుండి వచ్చిన ఈ సినిమా ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. అయితే టీవీల్లో బాగా చూశారు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని రీ- రిలీజ్ చేశారు.
మే 30 న 4K కి డిజిటలైజ్ చేసి ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఈ సినిమా సూపర్ గా కలెక్ట్ చేసింది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా 2వ రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి ‘ఖలేజా'(4K) 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 4.30 cr |
సీడెడ్ | 0.43 cr |
ఉత్తరాంధ్ర | 0.68 cr |
ఈస్ట్ | 0.26 cr |
వెస్ట్ | 0.35 cr |
గుంటూరు | 0.42 cr |
కృష్ణా | 0.38 cr |
నెల్లూరు | 0.15 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 6.97 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.55 cr |
ఓవర్సీస్ | 1.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 8.67 cr (షేర్) |
కొత్త సినిమాల పోటీగా ఉన్నా సరే ‘ఖలేజా'(4K) రీ- రిలీజ్ లో.. 2 రోజుల్లో ఏకంగా రూ.8.67 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఆదివారం కూడా భారీగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.