నిన్న మొన్నటిదాకా మాల్డీవ్స్ లో న్యూఇర్ సంబరాల్లో మునిగి తేలిన హీరోయిన్స్ అందరూ ఇప్పుడు కసరత్తులు చేస్తూ తెగ కష్టపడిపోతున్నారు. ఇందులో కియారా అద్వానీ కూడా నేనేం తక్కువ తినలేదు.. ఎక్కువే తిన్నాను.. అందుకే క్యాలరీస్ బర్న్ చేస్తున్నానంటూ తన జిమ్ వీడియోని ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. చక్కగా ఒంటిచేత్తో బ్యాలన్స్ చేస్తూ టైట్ ఫిట్ తో కుర్రాళ్లకి కిక్ ఇచ్చేలా కస్ మనే అందాలని చూపిస్తూ రెచ్చిపోతోంది కియారా.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంకాస్త డ్యూరేషన్ ఉంటే బాగుండేదే అని కియారా ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. కాస్త గ్యాప్ తర్వాత తన బాడీ అందాలకి మెరుగులు దిద్దుతూ జిమ్ లో తనకిష్టమైన ఎక్స్ ర్ సైజులు చేస్తూ కియారా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఛార్జెడ్ ఫర్ 2021 అంటూ ఈ పోస్ట్ పెట్టింది కియారా. ఇక ఆరోగ్యంపై కియారాకి ఎంత శ్రద్దో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో షేర్షా అనే సినిమాకి కమిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా రెండు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లుగా సమాచారం. మొత్తానికి అమ్మడి అందాలకు అందరూ ఫిదా అవుతున్నారన్నమాట. అదీ విషయం
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!