ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ చాలా కాలంగా సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ ఈ వార్తలపై స్పందించలేదు. వారి ప్రేమ విషయాన్ని సీక్రెట్ గా ఉంటుందో వస్తున్నారు. కానీ ఇద్దరూ కలిసి హాలిడే వెకేషన్స్ కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
అంతేకాకుండా.. కియారా అద్వానీ ఇప్పటికే చాలాసార్లు సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ ప్రేమ జంట తమ రిలేషన్ షిప్ ను బయటపెట్టాలని చూస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
అంతేకాదు.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా క్లారిటీ రానుంది. ఈ ఏడాదిలో వీరిద్దరూ కలిసి నటించిన ‘షేర్షా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మరింత దగ్గరయ్యారని టాక్.
ఇక కియారా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక సినిమాలో మరోసారి సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించబోతుంది. అలానే రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాలో కియారా అద్వానీను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా పూణే షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.