Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

ప్రామిసింగ్‌ హీరోగా కెరీర్‌ ప్రారంభించిన కిరణ్‌ అబ్బవరం.. ఆ తర్వాత సరైన కథల్ని ఎంపిక చేసుకోలేక వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొన్నాడు. ఏ సినిమా పట్టుకున్నా షాక్‌ కొట్టేలా తయారైంది సిట్యువేషన్‌. ఆ సమయంలో ‘క’ అంటూ ఓ సినిమా మంచి విజయం అందుకున్నాడు. ఆ వెంటనే చేసిన ‘కె ర్యాంప్‌’ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్‌ అయి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కిరణ్‌ అబ్బవరం జోరు మళ్లీ తగ్గిపోయింది. అనుకున్న ప్రాజెక్ట్‌లు అనుకున్నట్లుగా ముందుకు సాగడం లేదని టాక్‌.

Kiran Abbavaram

ఇలాంటి టాక్‌లు వస్తున్న సమయంలోనే సెట్స్‌ మీదకు రావాల్సిన కిరణ్‌ అబ్బవరం సినిమాలు అనుకున్నట్లుగ రావడం లేదు. అంతా ఓకే అనుకున్న సినిమాల దర్శకులు వేరే సినిమా పనుల్లో బిజీ అవుతున్నాడు. ఈ సమయంలోనే కిరణ్‌ బాలీవుడ్‌ ప్రయత్నాలు స్టార్ట్‌ చేస్తున్నాడు అని ఓ వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కిరణ్‌ ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పినట్టు టాక్. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జటాధర’ నిర్మాత ప్రేరణ అరోరా ఈ సినిమాకు నిర్మాత అని అంటున్నారు.

ఆ లెక్కన కిరణ్ అబ్బవరం నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ అని చెప్పొచ్చు. అయితే బాలీవుడ్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్‌ రిస్క్‌ చేస్తున్నాడా అనే మాట కూడా వినిపిస్తోంది. ఇక తెలుగు సినిమాల గురించి చూస్తే.. కిరణ్ చేతిలో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఒక్కటే ఉంది. ఆ సినిమాకు ఆ మధ్య ప్రచారం స్టార్ట్‌ చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ‘క’ సినిమా సీక్వెల్‌ ఉంటుంది కానీ కిరణ్‌ హీరో కాకపోవచ్చు అని ఆ సినిమా నిర్మాతే చెప్పి షాకిచ్చారు.

ఇక ‘పుష్ప’ సినిమాలకు సుకుమార్‌ దగ్గర పని చేసిన వీరా కొగటం దర్శకత్వంలో కిరణ్‌ ఓ సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పటివరకు ఆ సినిమా విషయంలో ఎలాంటి అప్‌డేట్‌ లేదు. హిట్‌ కొట్టాక కూడా ఇలాంటి పాజ్‌లు కచ్చితంగా షాక్‌లే అని చెప్పొచ్చు.

నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus