Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

రామ్‌చరణ్‌ – ఉపాసన ఇటీవల మరోసారి తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారి ఆనందం, అభిమానుల అత్యుత్సాహం అందరూ చూశారు. ఎందుకింత ఓవర్‌ చేశారు అని చాలామంది విమర్శించారు కూడా. కొంతమంది అయితే ఎప్పుడో చిరంజీవి సరదాగా అన్న మాటలు పట్టుకుని, ఇప్పటి ఆనందాన్ని లింక్‌ చేసి మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. వాటి విషయంలో ఇప్పటికే ఓసారి ఎక్స్‌లో స్ట్రాంగ్‌ వార్నింగ్‌ రిప్లై ఇచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

Lavanya Tripathi

కొన్ని నెలల క్రితం ఓ సినిమా ఈవెంట్‌లో చిరంజీవి తన వారసుడిపై కామెంట్స్ చేశారు. తాను ఇంటికి వెళ్తే లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉంటుందని సరదాగా అన్నారు. ఆ కామెంట్స్‌ని గుర్తు చేస్తూ ఇప్పుడు చిరంజీవిని మళ్లీ ట్రోల్ చేశారు. అందులో ఓ పాత్రికేయుడు కూడా ఉన్నారు. ఆ పోస్ట్‌కు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కౌంటర్ ఇచ్చారు. సంతోషకరమైన క్షణాలను వివాదాస్పదం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి మహిళలను గౌరవించే తీరు గురించి చెబుతూ.. ఇతరులను విమర్శించే ముందు వ్యక్తిగతంగా తెలుసుకోవాలని పోస్టు చేశారు.

కుటుంబంలోని మహిళలను చిరంజీవి చూసుకుంటారో తెలియనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆయన చేసిన దాంట్లో ఒక్క శాతం కూడా చేయని వారు ఆయనను విమర్శిస్తున్నారు అని రాసుకొచ్చారామె. ఇప్పుడు ఆమె ఓ సినిమా ప్రచారం కోసం బయటకు వచ్చినప్పుడు దీని గురించి మీడియా నుండి ప్రశ్న ఎదురైంది. చిరంజీవి ఇంట్లో ఎలా ఉంటారనేది మాకు తెలుసు. తమ కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను అని మరోసారి గట్టిగా చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తన ‘సతీ లీలావతి’ సినిమా ప్రచారం గురించి బయటకు వచ్చినప్పుడు లావణ్యకు ఈ ప్రశ్న ఎదురైంది. లావణ్యకు జోడీగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాను తాతినేని స‌త్య రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్‌ చేస్తారు.

 ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus