‘ఆమెను అందుకే తీసుకున్నారా?’ అంటూ కామెంట్స్.. ఆ హీరోయిన్ ఎవరంటే..

సినిమా ఇండస్ట్రీ అంటే అన్నిటికీ సిద్ధపడే రావాలి.. అందులోనూ యాక్టింగ్ అంటే ఎలాంటి లిమిట్స్, బౌండరీస్ పెట్టుకోకూడదు.. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. పలానా క్యారెక్టర్ చేయను.. అలాంటి డ్రెస్సులెయ్యను.. ముద్దు సీన్లు, బోల్డ్ సీన్ల వంటి వాటికి దూరం అని కండీషన్స్ పెట్టకూడదు.. మడి కట్టుకుని కూర్చోకూడదు అంటుంటారు.. సీనియర్ నటి రాధిక తన చెల్లెల్ని ఓ సినిమా షూటింగ్ అప్పుడు కమల్ హాసన్ సన్నివేశంలో భాగంగా ముద్దు కోసం బలవంతం చేశారని..

యాక్టింగ్ అంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యే రావాలని అన్నారని చెప్పిన సంగతి తెలిసిందే.. ‘భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్.. అంతకుముందు 63 ఏళ్ల సీనియర్ నటుడు నాజర్‌తో.. రచ్చ రంబోలా అనే రేంజ్‌లో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది.. మలయాళీ మూవీ ‘ఎరిడా’ (Erida) – a tale of a goddess in love.. లో 26 సంవత్సరాల సంయుక్త అలాంటి సీన్స్ చేస్తే షాక్ అయిన ఆడియన్స్..

ఇప్పుడు 66 ఏళ్ల వయసున్న సీనియర్ బాలీవుడ్ నటుడితో తెలుగు హీరోయిన్ లిప్ లాక్స్ చేయడం చూసి స్టన్ అయ్యారు.. యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్.. హాలీవుడ్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న పాపులర్ సిరీస్ ‘ ది నైట్ మేనేజర్’ ను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు.. అనిల్ కపూర్, శోభిత ధూళిపాల ముఖ్య పాత్రల్లో నటించారు.. సుసనా బేర్ డైరెక్ట్ చేశారు.. నాలుగు ఎపిసోడ్లతో కూడిన ఫస్ట్ సీజన్ ఫిబ్రవరి 17 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది..

ఈ సిరీస్‌లో శోభిత కాస్త గ్లామర్ డోస్ పెంచింది.. 30 ఏళ్ల శోభిత.. 66 ఏళ్ల అనిల్ కపూర్‌తో లిప్ లాక్ సీన్స్ చేసింది.. అది చూసిన నెటిజ్లను.. ‘‘శోభితను కేవలం ముద్దు సన్నివేశాలు చేయడానికి, బికినీలో అందాలు ఆరబోయడానికే తీసుకున్నారా?.. ఫస్ట్ సీజన్‌లో ఆమె క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ కూడా లేదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇంకో హైలెట్ ఏంటంటే.. ఆదిత్య రాయ్ కపూర్‌తోనూ అమ్మడు బోల్డ్ సీన్స్ చేసింది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus