మహేష్ అభిమానులకు శుభవార్త చెప్పిన కొరటాల శివ!

  • October 16, 2017 / 07:04 AM IST

బ్రహ్మోత్సవం మూవీ మహేష్ బాబు అభిమానులను నిరాశకు గురిచేసింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అది కూడా పరాజయం పాలవడంతో మహేష్ తో పాటు అతని ఫ్యాన్స్ కూడా డల్ అయిపోయారు. తరవాతి సినిమా ఏమవుతోందోనని ఆందోళన పడుతున్నారు. అయితే వారికి కొరటాల శివ దైర్యం చెప్పారు. ఈ సారి తప్పకుండా విజయం అందిస్తానని ధీమాగా చెప్పారు. కొరటాల శివ, మహేష్ కాంబినేషన్లో గతంలో శ్రీమంతుడు వచ్చింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా రూపుదిద్దుకుంటోంది. నిన్నటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలయింది.

ఈ సందర్భంగా డైరక్టర్ మాట్లాడుతూ భరత్ అనే నేను సినిమాలో క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అనేక అంశాలు ఉన్నాయని, వారు కోరుకునే యాక్షన్ సన్నివేశాలున్నాయని వెల్లడించారు. మహేష్ అభిమానులందరూ సినిమా విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోనవసరం లేదని స్పష్టం చేశారు. మహేష్ బాబు ముఖ్యమంత్రి గా కనిపించనున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ వేసవికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus