Koratala Siva: ఈ స్థాయి నెగిటివిటీని కొరటాల ఊహించలేదా?

Advertisement

దర్శకుడు కొరటాల శివ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను తీస్తారని ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో కొరటాల శివ ఖాతాలో నాలుగు విజయాలు చేరాయి. అయితే ఆచార్య ఫలితం వల్ల కొరటాల శివపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒక్క ఫ్లాప్ వస్తే ఈ స్థాయిలో టార్గెట్ చేస్తారా? అంటూ వైరల్ అవుతున్న విమర్శలపై కొరటాల శివ ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడ్డారు.

ఆచార్య విడుదలకు ముందు కొరటాల శివ సైతం ఈ స్థాయి నెగిటివిటీని ఊహించలేదని తెలుస్తోంది. కమర్షియల్ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనతో కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తే ఫలితం ఈ విధంగా వచ్చింది. ఆచార్య సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడం వల్లే రిజల్ట్ ఈ విధంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ ఈ సినిమా రిజల్ట్ తో జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కించే సినిమా మాత్రం కొరటాల శివ స్టైల్ లోనే ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు సంబంధించి వేర్వేరు గాసిప్స్ వైరల్ అవుతున్నా ఆ వార్తల్లో నిజం లేదని బోగట్టా. తారక్ అభిమానులు ఎన్టీఆర్ కొరటాల శివ జనతా గ్యారేజ్ ను మించిన సక్సెస్ ను సాధిస్తారని భావిస్తున్నారు. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారని వార్తలు వస్తున్నా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు కొరటాల శివ ఛాన్స్ ఇస్తే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్, కొరటాల శివ వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టూడెంట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus