ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

మన టాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ కి హార్డ్-కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకే ఫ్యామిలీలో తండ్రీ కొడుకులు సినిమాల్లో నటిస్తే వాటి పై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రియులంతా ఆ కాంబినేషన్లో సినిమాలు చూడాలని ఆశపడతారు. వస్తే రికార్డులు కొడతాయని థియేటర్లకు పరుగులు తీస్తారు. ఎన్టీఆర్- బాలయ్య, ఎన్టీఆర్- హరికృష్ణ, ఏఎన్నార్- నాగార్జున, కృష్ణ- రమేష్ బాబు, కృష్ణ- మహేష్ బాబు, చరణ్- చిరు,నాగార్జున- నాగ చైతన్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాంబినేషన్లు ఉన్నాయి.

ఇలా తండ్రీ కొడుకులు హీరోలుగా నటించిన ప్రతీసారి భారీ హైప్ ఏర్పడడం జరిగేది. సినిమా హిట్ అయితే ఓకె లేదంటే అభిమానులు చాలా హర్ట్ అయ్యేవారు. ఇలాంటి కాంబినేషన్లకి తగ్గ కథ రెడీ చేసుకోవడం.. దానిని తెరపై ఆవిష్కరించడం అనేది ఆషామాషీ విషయం కాదు. తేడా వస్తే ఆ డైరెక్టర్ కు అన్ని వైపుల నుండీ విమర్శలు ఎదురవుతాయి.అలా భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు ప్లాపులు అయ్యాయి. దాంతో విమర్శలు ఎదుర్కొన్న దర్శకులు కూడా లేకపోలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. తండ్రీకొడుకుల కాంబినేషన్లో రూపొంది.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సీనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ : వీరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ‘అక్బర్ సలీం అనార్కలి’ , ‘సింహం నవ్వింది’ వంటి సినిమాలు ప్లాప్ గా మిగిలాయి.

2) ఏఎన్నార్ – నాగార్జున : అక్కినేని వారి తండ్రీ కొడుకుల కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి కానీ ‘ అగ్ని పుత్రుడు’ ‘ఇద్దరూ ఇద్దరే’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.

3) కృష్ణ- మహేష్ బాబు : సూపర్ స్టార్లు ఇద్దరూ గతంలో కలిసి నటించిన ‘వంశీ’ ‘టక్కరి దొంగ’ సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.

4) మోహన్ బాబు – మంచు విష్ణు : వీరి కాంబినేషన్లో రూపొందిన ‘గేమ్’ గాయత్రి’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.

5) మోహన్ బాబు – మంచు మనోజ్ : వీరి కాంబినేషన్లో వచ్చిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రం ప్లాప్ అయ్యింది.

6) మహేష్ బాబు – గౌతమ్ : వీరిద్దరూ కలిసి నటించిన ‘1 నేనొక్కడినే’ మూవీ ప్లాప్ అయ్యింది.

7) సాయి కుమార్ – ఆది : వీరి కాంబినేషన్లో వచ్చిన ‘చుట్టాలబ్బాయి’ సినిమా ప్లాప్ అయ్యింది.

8) బ్రహ్మానందం – గౌతమ్ : వీరి కాంబినేషన్లో వచ్చిన ‘పల్లకిలో పెళ్ళికూతురు’ సినిమా ప్లాప్ అయ్యింది.

9) కృష్ణంరాజు – ప్రభాస్ : వీరి కాంబినేషన్లో రూపొందిన ‘రెబల్’ ‘రాధే శ్యామ్’ సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.

10) చిరంజీవి – చరణ్ : వీరి కాంబినేషన్లో రూపొందిన ‘బ్రూస్ లీ’ ‘ఆచార్య’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus