ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు..!

  • April 30, 2022 / 05:08 PM IST

అన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ లు అందుకోవు. సక్సెస్ అయిన సినిమాలు అన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి అని చెప్పలేము. ఇప్పటి రోజుల్లో ప్రతీ సినిమాని అది నెలకొల్పిన నంబర్స్ ను బట్టే హిట్టా ఫ్లాపా అనేది డిసైడ్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు. కానీ కొన్ని మంచి సినిమాలు కలెక్షన్లను రాబట్టలేకపోవచ్చు. బహుశా ఇప్పుడు సోలో రిలీజ్ అనేది దొరక్కపోవడం వల్ల కావచ్చు… లేదా మంచి రిలీజ్ డేట్ దొరక్కపోవడం వల్ల కూడా కావచ్చు. ఈ సమస్య పోస్ట్ కోవిడ్ టైంలో మాత్రమే కాదు గతంలో కూడా ఉండేది.

సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… కొంతమంది టాప్ డైరెక్టర్స్ ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాలు ఇచ్చారు. అంతేకాకుండా తర్వాత వాళ్ళు తీసిన సినిమాలను కూడా మరిపించలేకపోతున్నారు అని కూడా చెప్పాలి. ఆ దర్శకులు ఎవరో.. ప్రేక్షకులు క్లాసిక్స్ గా భావిస్తున్న వారి సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) త్రివిక్రమ్ శ్రీనివాస్ :

మన గురూజీ తీసిన సినిమాల్లో అందరికీ గుర్తుండిపోయే మూవీ ‘అతడు’. ఎంతో శ్రద్ధతో స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని… అందులో డైలాగ్ లానే గులాబీ మొక్కకి అంటు కట్టినట్టు ఉంటుంది ఈ మూవీ. త్రివిక్రమ్ తర్వాత ఎన్ని హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చినా ఈ మూవీని మాత్రం మరిపించలేకపోతున్నాడు అనే చెప్పాలి.

2) కొరటాల శివ :

ప్రభాస్ తో తెరకెక్కించిన ‘మిర్చి’ మూవీ ద్వారా దర్శకుడిగా మారాడు కొరటాల. అన్ని కమర్షియల్ హంగులతో ఈ మూవీని తీర్చిదిద్దాడు. ఈ మూవీ తర్వాత కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కానీ ‘మిర్చి’ ని మాత్రం మరిపించలేకపోతున్నాడు.

3) బోయపాటి శ్రీను :

‘భద్ర’ తో దర్శకుడిగా మారాడు బోయపాటి శ్రీను. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. అయితే ఎన్ని హిట్లు కొడుతున్నా ‘భద్ర’ ను మరిపించలేకపోతున్నాడు బోయపాటి.

4) సురేందర్ రెడ్డి :

ఈ స్టైలిష్ డైరెక్టర్ ‘కిక్’ అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రవితేజ మార్కెట్ ను రెండింతలు పెంచిన మూవీ ఇది. ‘కిక్2’ టైటిల్ మళ్ళీ దానికి సీక్వెల్ చేశారు కానీ ఆ మూవీని మరిపించలేకపోయారు. ఈ మూవీ తర్వాత ‘రేసుగుర్రం’ తో హిట్ కొట్టినా, ‘ధృవ’ , ‘సైరా’ వంటి సినిమాలను తెరకెక్కించినా ‘కిక్’ ను మరిపించలేకపోతున్నాడు.

5) వంశీ పైడిపల్లి :

‘ఊపిరి’ అనే చిత్రాన్ని నాగార్జున, కార్తీ లతో తెరకెక్కించాడు వంశీ. ‘ది ఇన్‌టచబుల్స్’ అనే ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కించినా.. ఈ మూవీని వంశీ తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. అంతకు ముందు ‘బృందావనం’ ‘ఎవడు’ వంటి హిట్లను అందించినా.. తర్వాత ‘మహర్షి’ అనే హిట్ ను అందించినా ‘ఊపిరి’ ని మాత్రం వంశీ మరిపించలేకపోతున్నాడు.

6) అనిల్ రావిపూడి :

తన మొదటి చిత్రంతోనే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. ఇతను తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. కానీ ‘పటాస్’ ను మరిపించలేకపోతున్నాడు. ఈ మూవీలో మాస్ కు కావాల్సిన ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది.

7) హరీష్ శంకర్ :

‘దబాంగ్’ రీమేక్ గా ‘గబ్బర్ సింగ్’ ను తెరకెక్కించాడు హరీష్. పవన్ కళ్యాణ్ కు పవర్ ఫుల్ కంబ్యాక్ మూవీగా నిలిచింది ఈ చిత్రం.అంతకుముందు ‘మిరపకాయ్’.. అటు తర్వాత హరీష్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్లిచ్చాడు కానీ ‘గబ్బర్ సింగ్’ ను మరిపించలేకపోతున్నాడు.

8) పూరి జగన్నాథ్ :

మహేష్ బాబుతో ‘పోకిరి’ అనే ఇండస్ట్రీ హిట్ ను తెరకెక్కించినా.. ఆ తర్వాత చేసిన ‘బిజినెస్మెన్’ మూవీ చాలా మందికి హాట్ ఫేవరెట్ అనిపించుకుంది. ఆ తర్వాత పూరి.. ‘టెంపర్’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ చిత్రాలను అందించినా… ‘బిజినెస్మెన్’ ను మరిపించలేకపోతున్నాడు.

9) బాబీ :

కె.ఎస్.రవీంద్ర అసలు పేరైనప్పటికీ.. బాబీ గానే అందరికీ పరిచయం. ‘పవర్’ చిత్రంతో ఓ రేంజ్లో ఎంట్రీ ఇచ్చాడు బాబీ. ఆ సినిమాని బాబీ తీర్చిదిద్దిన తీరు చాలా మాస్ గా అలాగే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆ తర్వాత బాబీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘జై లవ కుశ’ ‘వెంకీ మామ’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు కానీ ‘పవర్’ మూవీని మరిపించలేకపోతున్నాడు.

10) మెహర్ రమేష్ :

‘బిల్లా’ అనే చిత్రం రీమేక్ అయినప్పటికీ దానిని మెహర్ రమేష్ బాగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాని మరిపించేలా అయితే మెహర్ రమేష్ ఏ మూవీని తీయలేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus