మహేష్ సినిమాకి మరిన్ని జాగ్రత్తలు
- December 10, 2016 / 01:38 PM ISTByFilmy Focus
హ్యాట్రిక్ డైరక్టర్ కొరటాల శివ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయనున్న సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా శ్రీమంతుడు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఆ రికార్డులను రెండో చిత్రం అధిగమించాలని డైరక్టర్ భావిస్తున్నారు. అంతేకాదు తన డైరక్షన్లో వచ్చిన గత చిత్రం జనతా గ్యారేజ్ మిశ్రమ టాక్ వచ్చింది. తారక్ అభిమానుల నుంచి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు.
మహేష్ చిత్రం విషయంలో అటువంటి మిశ్రమ స్పందన రావడానికి వీలు లేదని, అన్ని ఏరియాల్లో హిట్ టాక్ రావాలని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసమే స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. స్క్రిప్ట్ పూర్తిగా సంతృప్తి నిచ్చే వరకు సెట్స్ మీదకు వెళ్ళేదే లేదని తన సహాయ దర్శకులకు చెప్పినట్లు సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న మహేష్ 24 ఫిల్మ్ కి “భరత్ అను నేను” అనే పేరుని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 22 తేదీన విడుదల చేయాలనీ భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















