Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వ‌రుణ్ తేజ్‌ (Hero)
  • రితికా నాయ‌క్‌ (Heroine)
  • స‌త్య‌, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, వీటీవీ గ‌ణేష్, బుల్లిరాజు, సునీల్ త‌దిత‌రులు (Cast)
  • మేర్ల‌పాక గాంధీ (Director)
  • రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి (Producer)
  • త‌మ‌న్‌ (Music)
  • మనోజ్ రెడ్డి (Cinematography)
  • స‌త్య జి (Editor)
  • Release Date : 7th ఆగ‌స్ట్‌ 2026
  • యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ (Banner)

కెరీర్ ఆరంభం నుంచి ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌ను ఎంచుకుంటూ సినిమాలు చేశాడు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌ (Varun Tej). కానీ ఈ ప్ర‌యోగాలు అంత‌గా అచ్చిరాక‌పోవ‌డంతో హిట్టు కోసం హార‌ర్ కామెడీ క‌థ‌తో కొరియ‌న్ క‌న‌క‌రాజు (Korean Kanakaraju) సినిమా చేశాడు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల ఫేమ్ మేర్ల‌పాక గాంధీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రితికా నాయ‌క్ హీరోయిన్‌గా న‌టించింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కొరియ‌న్ క‌న‌క‌రాజుతో వ‌రుణ్‌తేజ్ స‌క్సెస్ బాట ప‌ట్టాడా? అత‌డికి మేర్ల పాక గాంధీ హిట్టు ఇచ్చాడా? హార‌ర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

Korean Kanakaraju Movie Review

క‌థ‌: క‌న‌క‌రాజు (Varun Tej) పెనుకొండ‌లో చెక్క భ‌జ‌న‌ బృందాన్ని న‌డుపుతుంటాడు. క‌న‌క‌రాజు అన్న‌య్య పృథ్వీరాజ్ (అవ‌స‌రాల శ్రీనివాస్‌) సింగ‌పూర్‌లో బిజినెస్ చేయ‌డానికి వెళ‌తాడు. అందుకోసం అవ‌స‌ర‌మైన డ‌బ్బును చెన్నారెడ్డి (సునీల్‌) ద‌గ్గ‌ర అప్పు తీసుకుంటాడు క‌న‌క‌రాజు తండ్రి. అప్పు తీర్చ‌లేక‌పోవ‌డ‌మే కాకుండా త‌న అసిస్టెంట్ క‌ర్రి శీనును క‌న‌క‌రాజు కొట్ట‌డంతో అత‌డిపై ప‌గ‌ను పెంచుకుంటాడు చెన్నారెడ్డి. ఇంత‌లోనే క‌ర్రిశీను దారుణంగా చ‌నిపోతాడు. చెన్నారెడ్డి ఎముక‌ల‌న్నీ విరిగిపోయి హాస్పిట‌ల్ పాల‌వుతాడు. అత‌డి మ‌నుషులు క్రూరంగా హ‌త్య‌కు గుర‌వుతారు. ఈ హ‌త్య‌ల‌న్నీ క‌న‌క‌రాజు శ‌రీరంలో ఉన్న కొరియ‌న్ ఆత్మ చేసిన ప‌ని అని కిష్ట‌ప్ప (Satya) క‌నిపెడ‌తాడు. కొరియ‌న్ ఆత్మ క‌న‌క‌రాజు శ‌రీరాన్ని వ‌దిలిపెట్టాలంటే దాని చివ‌రి కోరిక ఏమిటో తెలుసుకొని తీర్చేయాల‌ని, అది కూడా 21 రోజుల్లోనే పూర్తిచేయాల‌ని భూత‌వైద్యుడైన‌ కిష్ట‌ప్ప తండ్రి చెబుతాడు. దాంతో క‌న‌క‌రాజు తాను ప్రేమించిన చైత్ర (Ritika Nayak), స్నేహితుడు కిష్ట‌ప్ప‌తో క‌లిసి కొరియా వెళ‌తాడు.

అక్క‌డికి వెళ్లిన త‌ర్వాతే క‌న‌క‌రాజు శ‌రీరంలో ఉన్న ఆత్మ కొరియ‌న్ గ్యాంగ్‌స్ట‌ర్ జాంగ్ సు అలియాస్ ఫోర్ ఫింగ‌ర్స్‌ది అని తెలుస్తుంది. క‌న‌క‌రాజు బాడీలోనే ప‌ర్మినెంట్‌గా ఉండిపోవాల‌ని ఫోర్ ఫింగ‌ర్స్ ప్లాన్ చేస్తాడు.కొరియ‌న్ గ్యాంగ్‌స్ట‌ర్ ఆత్మ క‌న‌క‌రాజు శ‌రీరంలోకి ఎలా వ‌చ్చింది? ఫోర్ ఫింగ‌ర్స్‌ను చంపింది ఎవ‌రు? సింగ‌పూర్‌లో బిజినెస్ చేయాల్సిన క‌న‌క‌రాజు అన్న‌య్య కొరియాలో ఏం చేస్తున్నాడు? కొరియ‌న్ ఆత్మ బారి నుంచి క‌న‌క‌రాజును చైత్ర‌, కిష్ట‌ప్ప ఎలా కాపాడారు? అత‌డికి కాల‌భైర‌వుడు ఎలాంటి సాయం చేశాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: పెనుకొండ యువ‌కుడిగా మాస్ రోల్‌లో…కొరియ‌న్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క్లాస్ రోల్‌లో రెండు షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ వేరియేష‌న్ చూపించిన తీరు బాగుంది. లుక్‌, డైలాగ్ డెలివ‌రీ, బాడీలాంగ్వేజ్ అన్నింటిలో ఆ వైవిధ్య‌త క‌న‌బ‌రిచాడు. కొరియ‌న్ గ్యాంగ్‌స్ట‌ర్ క్యారెక్ట‌ర్‌లో హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యింది. వ‌రుణ్‌తేజ్ స్నేహితుడు కిష్ట‌ప్ప‌గా స‌త్య కామెడీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ రిలీఫ్‌గా నిలిచింది. చివ‌రి వ‌ర‌కు త‌న పంచ్‌ల‌తో న‌వ్వించాడు. హీరోతో స‌మానంగా స‌త్య పాత్ర సినిమాలో క‌నిపిస్తుంది. రితినా నాయ‌క్ క్యారెక్ట‌ర్‌గా పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. పాట‌ల‌కే ప‌రిమిత‌మైంది . భూత వైద్యుడిగా ముర‌ళీధ‌ర్ గౌడ్ హిలేరియ‌స్‌గా కామెడీని పండించాడు. స‌త్య‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే క్షుద్ర‌పూజ‌ల సీన్ ఫ‌న్నీగా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌ వీటీవీ గ‌ణేష్, బుల్లిరాజు కామెడీ ఓకే అనిపిస్తుంది. సునీల్ విల‌నిజంలో సీరియ‌స్‌నెస్ మిస్స‌య్యింది. కొరియ‌న్ గ్యాంగ్ త‌మ ప‌రిధుల మేర మెప్పించారు. అవ‌స‌రాల శ్రీనివాస్ గెస్ట్‌గానే అయినా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: హార‌ర్‌, కామెడీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ భ‌య‌పెడుతూనే ఈ సినిమాతో న‌వ్వించాడు.
కాన్సెప్ట్ రొటీన్ అయినా స్క్రీన్‌ప్లే ను డిఫ‌రెంట్‌గా రాసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. కొరియ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా సినిమాలు రాక‌పోవ‌డం కొరియ‌న్ క‌న‌క‌రాజుకు ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది.

త‌మ‌న్ బీజీఎమ్ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు త‌గ్గ‌ట్లుగా హై పిచ్‌లో ఉంది. పాట‌ల్లో రాసాగుమ్మాడి బాగుంది. మ‌నోజ్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు రిచ్‌నెస్‌ను తీసుకొచ్చింది. యూవీ క్రియేష‌న్స్, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ నిర్మాత‌లు బ‌డ్జెట్ విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కాలేదు. ఈ సినిమా చాలా వ‌ర‌కు షూటింగ్ కొరియాలోనే సాగింది. అనుకున్న‌దానికంటే ఎక్కువే ఖ‌ర్చు చేసిన‌ట్లుగా క‌నిపించింది. ర‌న్‌టైమ్ ఎక్కువే అనిపిస్తుంది. రెండు గంట‌ల న‌ల‌భై ఐదు సినిమాలు కాకుండా ప‌దిహేను నిమిషాలు త‌గ్గిస్తే బాగుండేది.

విశ్లేష‌ణ‌: హీరో శ‌రీరంలోకి ఓ ఆత్మ ప్ర‌వేశించ‌డం, ఆ ఆత్మ ప్ర‌తీకారంతో ర‌గిలిపోతుండ‌టం.. ఈ టైప్ క‌థ‌ల‌తో తెలుగులో చాలానే హార‌ర్ సినిమాలు వ‌చ్చాయి. కొరియ‌న్ క‌న‌క‌రాజు కాన్సెప్ట్ కూడా ఇదే. చాలా వ‌ర‌కు ఈ హార‌ర్ కామెడీ సినిమాల్లో లోక‌ల్ ఆత్మ‌లే హీరోల‌ను ఆవ‌హిస్తుంటాయి. కానీ క‌న‌క‌రాజు బాడీలోకి విదేశీ ఆత్మ అందులోనూ కొరియ‌న్‌ ఆత్మ ప్ర‌వేశిస్తుంది. అదొక్క‌టే డిఫ‌రెంట్ పాయింట్‌. మిగిలిన కామెడీ, ఆత్మ కార‌ణంగా హీరో ప‌డే ఇబ్బందులు, ఫ్లాష్‌బ్యాక్, ల‌వ్‌స్టోరీ ఇవ‌న్నీ తెలుగులో గ‌తంలో వ‌చ్చిన హార‌ర్ కామెడీ సినిమాల‌ను గుర్తుకుతెస్తుంది.

పాత క‌థ‌నే ఎంచుకున్న ద‌ర్శ‌కుడు ట్రీట్‌మెంట్ విష‌యంలో కొత్త‌గా అడుగులు వేశాడు. ఆడియెన్స్ బోర్‌గా ఫీల‌వ్వ‌కుండా ఉండ‌ట‌మే కాకుండా క‌థ రొటీన్ అనే ఆలోచ‌న రాకుండా స‌త్య పాత్ర‌ను బాగా వాడుకున్నాడు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి గ్యాప్ లేకుండా స‌త్య వేసే పంచ్‌లు, కామెడీ సీన్లు ఈ సినిమాను కాపాడాయి. క‌థ రొటీన్‌గా వెళ్లిపోతుంది అనుకున్న ప్ర‌తి సారి కామెడీతో క‌వ‌ర్ చేశాడు.

ఫ‌స్ట్ హాఫ్ మొత్తం పెనుకొండ నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది. చైత్ర‌తో ల‌వ్‌స్టోరీ, చెన్నారెడ్డితో గొడ‌వ‌ల‌తో ఒకే అనిపిస్తుంది. ఎప్పుడైతే క‌న‌క‌రాజులోకి కొరియ‌న్ ఆత్మ ప్ర‌వేశిస్తుందో అక్క‌డి నుంచే ఈ సినిమా ఆస‌క్తిక‌రంగా మారుతుంది. బిజినెస్‌మెన్ అనుకున్న ఆ ఆత్మ గ్యాంగ్‌స్ట‌ర్ అని రివీల‌య్యే ట్విస్ట్‌, అక్క‌డ వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ బాగున్నాయి. క‌న‌క‌రాజు బాడీలోనే సెటిల‌వ్వాల‌ని ఆత్మ ప్ర‌య‌త్నాలు చేయ‌డం, ఆ గ్యాంగ్‌స్ట‌ర్ బారి నుంచి క‌న‌క‌రాజును కాపాడేందుకు చైత్ర‌, కిష్ట‌ప్ప చేసే ప్ర‌య‌త్నాల చుట్టూ సెకండాఫ్‌ను న‌డిపించాడు డైరెక్ట‌ర్‌. ఇక్క‌డ కూడా సీరియ‌స్‌నెస్ కంటే కామెడీనే డైరెక్ట‌ర్ ఎక్కువ‌గా న‌మ్ముకున్నాడు. ఫోర్ ఫింగ‌ర్స్‌ను చంపింది ఎవ‌ర‌నే ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో భ‌క్తి ఎలిమెంట్‌ను ట‌చ్ చేశాడు డైరెక్ట‌ర్‌. హై ఫీల్‌తో ఎండ్ చేశారు.

ఫోక‌స్ పాయింట్‌: కొరియ‌న్ క‌న‌క‌రాజు హిలేరియ‌స్‌గా న‌వ్విస్తూనే థ్రిల్‌ను పంచుతుంది. వ‌రుణ్‌తేజ్‌కు మంచి క‌మ్‌బ్యాక్ మూవీ.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

 

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus