ఆ నటిలో ఈ కోణం కూడా ఉందంటూ ఆకాశానికెత్తుతున్న పరిశ్రమ!

Advertisement

కమెడియన్‌గా అదరగొట్టిన వాళ్లు.. సీరియస్‌ రోల్స్‌ కూడా బాగా చేస్తారు అని అంటుంటారు. ఈ మాటల్ని నిజం చేస్తూ గతంలో కొంతమంది హాస్య నటులు సీరియస్‌ పాత్రలు చేసి వావ్‌ అనిపించారు. తెలుగు, తమిలం నుండి ఇలాంటి వాళ్లు వచ్చారు. ఈ జాబితాలోకి కోవై సరళ కూడా చేరారు. తల్లి పాత్రలు, వదిన పాత్రలు వేస్తూ.. నవ్వులు పూయించే కోవై సరళ.. ఒక్కసారిగా సీరియస్‌ పాత్ర చేసి అదరగొట్టారు. ఈ మాట మేం అనడం లేదు.

ఆమె తాజాగా సినిమా చూసి మొత్తం తమిళనాడే అంటోంది. లేడీ కమెడియన్స్‌లో కోవై సరళది ప్రత్యేకమైన స్టయిల్‌. ‘వీరప్రతాప్‌’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన కోవై సరళ ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాలో బ్రహ్మానందం జోడీగా ఆమె నటన చూసి.. తెగ నవ్వుకున్నారు. ఆ సినిమాలో ఆవిడ పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. విలక్షణమైన గొంతుతో, వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్‌తో లుగులో దాదాపు అందరు అగ్ర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

అయితే వయసు రీత్యా ఈ మధ్య సినిమాలు తగ్గించిన కోవై సరళ తాజాగా ‘సెంబి’ అనే ఓ సీరియస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఆ సినిమా ఇటీవల తమిళంలో విడుదలైంది. ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త షేడ్స్‌లో కోవై సరళను చూపించారు ప్రభు సాల్వన్‌. వైవిధ్యమైన మేకప్‌తో రా లుక్‌ వచ్చింది. సినిమా బాగా నచ్చడంతో కమల్ హాసన్ తెగ మెచ్చుకున్నారు.

అయితే సినిమాలో కమర్షియల్ ఫ్లేవర్ లేకపోవడం వల్ల కామన్ ఆడియన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ కాకపోవచ్చు అంటున్నారు. కానీ కోవై సరళ అయితే అదిరిపోయే నటనతో వావ్‌ అనిపించారు అని అంటున్నారు. సోషల్ ఇష్యూస్ మీద ఆసక్తి ఉన్న వాళ్లకు ‘సెంబి’ బాగా నచ్చుతుంది అంటున్నారు. మరి ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ ఏ ఓటీటీలో వస్తుందో చూడాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus