క్రిష్ ఎంత బయపడ్డారో మీరే చదవండి..!

Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోల మధ్య స్నేహం ఉన్నప్పటికీ వారి అభిమానుల మధ్య వైరం ఉంది. అందువల్ల ఒక హీరో గురించి పొగిడినప్పటికీ మరో హీరో అభిమానులు చుక్కలు చూపిస్తున్నారు. సామాన్యుడికైనా, గొప్ప టెక్నీషియన్లకైనా ఆ తిప్పలు తప్పడం లేదు. ఈ అనుభవం క్రిష్ కి  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సమయంలో ఎదురైంది. ఈ సినిమా ఆడియో వేడుకలో క్రిష్ ఆనందంలో చెప్పిన ‘ఖబడ్దార్’ అనే మాట చిక్కులు తెచ్చిపెట్టింది. తమ సినిమాకు పోటీగా వస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’ని ఉద్దేశించి క్రిష్ ఆ వ్యాఖ్యలు చేశాడంటూ ప్రచారం జరగడంతో క్రిష్‌ వివాదంలో ఇరుక్కున్నారు. తనే స్వయంగా ఆమాటపై వివరణ ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ ప్రభావం క్రిష్ మీద ఇంకా తగ్గినట్లు లేదు.

తాజాగా ఐఫా అవార్డుల వేడుకకు భార్యతో కలిసి హాజరైన క్రిష్ మాటల్లో ఆ ప్రభావం స్పష్టంగా తెలిసింది.  క్రిష్ భార్య రమ్యను మీకు నచ్చిన దర్శకుడెవరు అని యాంకర్ అడిగితే.. ఆమె క్రిష్ అని చెప్పింది. ఆ తర్వాత ఆమెను మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగితే.. అప్పుడు క్రిష్ జోక్యం చేసుకుని ‘నేనే’ అన్నారు. ఆశ్చర్యం తో చూస్తున్న యాంకర్  ని చూసి ఓ నవ్వు నవ్వి.. ” నిజానికి రమ్యకు ఇద్దరు ముగ్గురు హీరోలంటే ఇష్టం. కానీ వాళ్ల పేర్లు చెబితే.. మిగతా హీరోలు కొడతారేమోనని భయం. అందుకే వాళ్ల పేర్లు చెప్పనివ్వట్లేదు” అని క్రిష్ చమత్కరించారు. ఈ మాటలను బట్టి హీరోల అభిమానులంటే ఈ డైరక్టర్ కి ఎంత భయమో తెలుస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus