కె .వి .రెడ్డి అవార్డు అందుకున్న క్రిష్

  • February 23, 2017 / 09:06 AM IST

‘యువకళావాహిని’ అధ్వర్యం లో రవీంద్రభారతిలో ఫిబ్రవరి 22న కె .వి .రెడ్డి అవార్డు ప్రదానోత్సవం ఘనం గా జరిగింది . మాజీ ముఖ్యమంత్రి ,గవర్నర్ కె .రోశయ్య చేతులమీదుగా దర్శకుడు క్రిష్ కె .వి .రెడ్డి అవార్డు ను అందుకున్నారు . కె .వి .రెడ్డి తక్కువ చిత్రాలే తీసినా అన్నీ జన రంజకం గా రూపొందించారని …. ఆ చిత్రాలు తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయని రోశయ్య అన్నారు. తెలుగు చలన చిత్ర రంగానికి గౌరవాన్ని ఆపాదించిన దర్శకులలో కె .వి .రెడ్డి అగ్ర గణ్యుడని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు . ప్రపంచ చలన చిత్ర రంగానికి పాఠ్యఅంశం గా నిలిచిన అలనాటి చిత్రాలను పాఠ్య గ్రంధాలుగా నేటి దర్శకులు అధ్యయనం చెయ్యాలని అన్నారు . కె .వి .రెడ్డి అవార్డు అందుకోవడమంటే జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం తో సమానమని, అవార్డు గ్రహీత క్రిష్ పెరిగిన బాధ్యతతో మరింత మంచి చిత్రాలు చెయ్యాలని అన్నారు.

తన చిత్రం లోని డైలాగ్ లా ‘ జనం చూసేదే మనం సెయాల ‘ అనేదే కె .వి .రెడ్డి గారు అనుసరించిన విధానమని అవార్డు గ్రహీత క్రిష్ అన్నారు … ‘మాయాబజార్’ కు సరితూగే చిత్రం ఇంతవరకు రాలేదని, తోట రాముడు ను మించిన కమర్షియల్ హీరో లేడని అన్నారు . చిత్ర నిర్మాణం లో కె .వి .రెడ్డి గారి స్ఫూర్తి తో… తప్పటడుగులు వేసినా, తప్పుటడుగులు పడకుండా పయనిస్తానన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus