మరో చందమామని కిందకి దించుతాడా ?

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సంచలన విజయం సాధించింది. కొత్తవారితో సినిమా చేసినప్పటికీ స్టార్ హీరోల సినిమాలతో పోటీగా కలక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా చూసి నాగార్జున ఛాన్స్ ఇచ్చారు. అతనితోను నిన్నే పెళ్లాడుతా వంటి అద్భుతమైన ప్రేమకథని తెరకెక్కించి క్రియేటివ్ డైరక్టర్ అని పేరు తెచ్చుకున్నారు. అలాగే ఖడ్గం వంటి దేశభక్తి సినిమాని మలిచి మెప్పు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అంతః పురం, సముద్రం, మురారి.. ఇవన్నీ అభినందనలు అందుకున్నవే. ఇక చందమామ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

2007 లో వచ్చిన ఈ సినిమానే కృష్ణవంశీ కి ఆఖరి హిట్ సినిమా. ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. పదేళ్లుగా అతని వద్దకు విజయలక్ష్మి రానంటోంది. అందుకే ఈసారి తనకి కలిసి వచ్చిన ప్రేమ కథని ఎంచుకున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇందులో అందరూ కొత్తవాళ్లే ఉండబోతారని టాక్. ఈ సినిమాతో హిట్ ట్రాక్ రావాలని ప్రయత్నిస్తున్నారు. అతని అభిమానులు ఈసారి మళ్ళీ చందమామ లాంటి సినిమాని అందిస్తారని ధీమాగా చెబుతున్నారు. ఈ చిత్ర వివరాలను అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus