టాలీవుడ్లో రెబల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు.. ఆదివారం తెల్లవారుజామున ఎవ్వరూ ఊహించని విధంగా మరణించిన సంగతి తెలిసిందే. సినీరంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఈయన రాణించారు. కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్ గా, విలన్ గా చేసిన కృష్ణంరాజు.. అటు తర్వాత హీరోగా మారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉండగా.. కృష్ణంరాజు పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది.
అయితే కృష్ణంరాజు మొదటి భార్య గురించి మాత్రం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. కృష్ణంరాజు గారికి మొదటి పెళ్లి సీతాదేవి గారితో జరిగింది. మే 10, 1969 న వీరి పెళ్లి జరిగింది. సీతాదేవి గారు కృష్ణంరాజు గారికి స్వయానా మేనకోడలు. ఆయన తన బావగారి కూతుర్నే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి టైంకి కృష్ణం రాజు ‘అమ్మ కోసం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఒక జంట కాగా…
అలాగే కృష్ణం రాజు, రేఖ మరో జంటగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ స్పాట్ నుండే ‘అమ్మ కోసం’ చిత్రం నటీనటులు మొగల్తూరు కోటలో జరుగుతున్న కృష్ణంరాజు వివాహానికి హాజరయ్యారు. ఇంకా చాలా మంది హీరోలు , హీరోయిన్లు.. కృష్ణంరాజు మొదటి పెళ్లికి హాజరయ్యారు. 1995లో ‘సీతా దేవి’ గారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో అక్కడికక్కడే మరణించారు. కొన్నాళ్ల తర్వాత శ్యామలా దేవి గారిని రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు గారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!</strong