రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కన్నీళ్లతో ఆయన కుటుంబసభ్యులు తుది వీడ్కోలు పలికారు. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. కృష్ణంరాజుని చివరిచూపు చూసుకోవడం కోసం అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. అయితే కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఫామ్‌హౌస్‌లోకి అనుమతించారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండడానికి కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించామని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. కృష్ణంరాజు మరణాన్ని కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన భార్య, కూతుళ్లతో పాటు ప్రభాస్ కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశారు. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి అయితే తన భర్త పాడెను మోసి అతడిపై ఉన్న ప్రేమను చివరిసారిగా వ్యక్తపరిచింది. ఆ దృశ్యాలు గుండెబరువెక్కే విధంగా ఉన్నాయి. సెలబ్రిటీలందరూ కూడా కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు.సినిమా సెట్స్ లో కూడా కృష్ణంరాజుకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన సినిమా సెట్స్ లో కృష్ణంరాజు ఫొటో ఏర్పాటు చేసి.. తన టీమ్ తో కలిసి మరోసారి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోపక్క సంచలన దర్శకుడు ఆర్జీవీ షూటింగ్స్ ఆపేసి కృష్ణంరాజుకి నివాళులు అర్పించాలంటూ ట్వీట్స్ పెడుతున్నారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!