‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. యూత్ లో ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో జనాలంతా కూడా ఆమెని బేబమ్మ అంటూ పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. యంగ్ హీరోలంతా తమ సినిమాల్లో కృతిని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నానితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ రామ్-లింగుస్వామి ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కనిపించనుంది.
రీసెంట్ గా నాగచైతన్య నటించనున్న ‘బంగార్రాజు’ సినిమాలో కృతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా కోసం కృతికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. నిజానికి కృతికి యాభై లక్షల రేంజ్ లో పారితోషికం చెల్లిస్తున్నారు. కానీ ‘బంగార్రాజు’కి మాత్రం మరింత పెంచి రూ.75 లక్షలు ఇస్తున్నారట. యూత్ లో ఆమెకి ఉన్న క్రేజ్ కారణంగానే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా విడుదలైన సమయంలో ‘బంగార్రాజు’ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశారు.
ఇప్పటికీ ఈ సినిమా ఫైనల్ అయింది. నాగార్జున, నాగచైతన్య నటిస్తోన్న ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తొలిసారి ఈ సినిమాలో తండ్రీకొడుకులు కలిసి నటిస్తున్నారు.