దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

సినిమా ప్రపంచంలో సెలబ్రెటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎప్పుడు విడిపోతారో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్స్ సెలక్షన్ మాత్రం చాలా విబిన్నంగా ఉంటుంది. చాలా వరకు హీరోయిన్స్.. ఎక్కువగా దర్శకులకు పడిపోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇక అలాంటి సెలబ్రెటీల వివరాల్లోకి వెళితే..

మణిరత్నం అమాయకత్వ తెలివిని చూసి సుహాసిని మొదటి చూపులోనే అతనికి ఎట్రాక్ట్ అయ్యారు. 1988లో వీరు వివాహం చేసుకున్నారు.

నటి ఖుష్భూ సైతం డైరెక్టర్ సి.సుందర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 2000వ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది.

ఓ వైవు రాజకీయాలు మరోవైపు బుల్లితెర షోలు అంటూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్న రోజా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2002లో వీరు సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు.

అప్పట్లో టాప్ మోస్ట్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్న బాలుమహేంద్ర నటి శోభను వివాహం చేసుకున్నారు. ఇక ఆమె పెళ్ళైన రెండేళ్లకే 1980లో సూసైడ్ చేసుకుంది. అనంతరం ఆ దర్శకుడు మౌనిక అనే మరో నటిని పెళ్లి చేసుకున్నాడు.

నటి శరణ్య డైరెక్టర్ పొన్ననన్ 1995లో వివాహం చేసుకుంది.

దేవయాని, డైరెక్టర్ రాజ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో వీరి ప్రేమకు ఇంట్లో అడ్డుపడ్డారు. అనంతరం 2001లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ – రమ్యకృష్ణను ప్రేమించిన ఏడేళ్ళ అనంతరం వివాహం చేసుకున్నాడు. 2003లో వీరి వివాహం జరిగింది.

ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రీత తమిళ డైరెక్టర్ హరిని పెళ్లి చేసుకున్నారు. భరణి, సింగం, వంటి సినిమాలతో హరి కమర్షియల్ దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్నాడు.

Share.