మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకొని అనంతరం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇకపోతే కృతి శెట్టి నాని సరసన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య సరసన బంగారు రాజు వంటి సినిమాలలో నటించి హిట్ కొట్టారు. ఇకపోతే తాజాగా రామ్ సరసన నటించిన దివారియర్ సినిమా కూడా నేను ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి నటుడు నాగచైతన్య గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం వచ్చే నెలలో నాగచైతన్య హీరోగా ప్రారంభం కాబోతుందని బహుశా మా ఇద్దరి జోడిని ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు అంటూ ఈమె తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలామంది సెలబ్రిటీలకు ప్రశాంతత లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని చెబుతారు
అయితే నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ రాలేదని తెలిపారు. ముఖ్యంగా నాగచైతన్యతో సినిమా చేసేటప్పుడు తను ఎంత ప్రశాంతంగా ఉంటారో అర్థం అయిందని కృతి శెట్టి వెల్లడించారు. ఇకపోతే ఈమె నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. చైతన్య ఏ విషయంలోనైనా ఎంతో నిజాయితీగా ఉంటారు. ఆయనది ఎంతో స్వచ్ఛమైన మనసు. ఆయనలో ఉన్నటువంటి
ఈ మంచి గుణాలు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని ఈ సందర్భంగా కృతి శెట్టి నాగచైతన్య గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య గురించి కృతి శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.