Kriti Kharbanda: ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్!

సుమంత్ హీరోగా రూపొందిన ‘బోణి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది కృతి కర్బంద. అటు తర్వాత నాని-నందినీ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల మొదలైంది’ లో కూడా చిన్న పాత్ర పోషించింది. ఈమె నటించిన హిట్ సినిమా ఏమైనా ఉందా అంటే ఇదొక్కటే..! ఆ తర్వాత చేసిన ‘తీన్ మార్’ ‘మిస్టర్ నూకయ్య’ ‘ఒంగోలు గిత్త’ ‘ఓం 3D’ ‘బ్రూస్ లీ’ ఇలా అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో ఈమెకు అవకాశాలు కరువయ్యాయి.

తర్వాత ఈమె టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా ఈమె రాణించింది అంతంతమాత్రమే. ఈమె లుక్స్ బాగుంటాయి కాబట్టి అడపా దడపా సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. అయితే ఈమె ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్లుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే రోజున ఈమె ఆ వార్తలను నిజం చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. కృతి బాయ్ ఫ్రెండ్ పేరు పుల్కిత్ సామ్రాట్.

ఇతను కూడా నటుడే..! పలు హిందీ సీరియల్స్ లో అలాగే సినిమాల్లో నటించి పాపులర్ అయ్యాడు.గతంలో ఇతను శ్వేతా రోహిరా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పుల్కిత్. కానీ ఏడాదికే తన మొదటి భార్యతో విడిపోయాడు. 2019 లో కృతి – పుల్కిత్ లకు పరిచయం ఏర్పడటం, తర్వాత అది ప్రేమగా మారడం జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని సమాచారం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus