Kriti Sanon: ఆ కారణంగానే ఆదిపురుష్ లో సీత పాత్రను ఆ స్టార్ హీరోయిన్ వద్దనుకున్నారా?

  • June 17, 2023 / 08:58 PM IST

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ మూవీని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ట్రోలింగ్స్, విమర్శలను ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పుడు జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమా యాజరేజ్ టాక్ నడుస్తోంది. విడుదలైన తరువాత కూడా విమర్శలకు ఏమి తక్కువగా లేదు. హిందు సంఘాలు ఏకంగా హైకోర్టు మెట్లుకెక్కాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిచింది. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. ఈ సినిమాలో మొదట సీత పాత్రకు పోస్టర్ విడుదలైన సందర్భంగా (Kriti Sanon) కృతిసనన్ అనేక విమర్శలు ఎదుర్కోంది.

ఆ పాత్రకు న్యాయం చేయగలదా అనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు సినిమా మొత్తం మీద యావరేజ్ టాక్ వచ్చిన సీత పాత్రకు మాత్రం హిట్ టాక్ నడుస్తోంది. అయితే నిజానికి ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ కృతి సన్ కాదట. మూవీ మేకర్స్ సీత పాత్ర కోసం మొదటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను అనుకున్నారట. ఇదే విషయాన్ని దీపిక పదుకొనేతో చర్చించగా.. అప్పటికే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆది పురుష కోసం డేట్స్ అడ్జస్ట్ కాలేదట.

దీంతో దీపిక పదుకొనే ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లను కూడా పరిశీలించారట. కానీ చివరకు కృతి సనన్ ని ఓకే చేశారట. మొత్తానికి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ ముందు చాలామంది స్టార్ హీరోయిన్లను వరించినా.. చివరికి కృతి సనన్ మాత్రం ఆ ఛాన్స్ ని కొట్టేసింది…!!

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus