Kriti Shetty: ‘కస్టడీ’పైనే కృతి ఆశలన్నీ!

  • February 25, 2023 / 05:59 PM IST

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని.. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకి అవకాశాలు పెరిగాయి. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘వారియర్’, ‘మాచర్ల నియోజవర్గం’ ఇలా వరుస సినిమాల్లో నటించింది. వీటిలో రెండు సినిమాలు పెద్దగా వర్కవుట్ కానప్పటికీ.. కృతి కెరీర్ కి ఢోకా ఉండదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. కృతి శెట్టి చేతిలో ‘కస్టడీ’ అనే సినిమా తప్ప మరో తెలుగు ప్రాజెక్ట్ లేదు.

నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమా కృతి కెరీర్ కి కీలకంగా మారింది. ఈ సినిమా విడుదల సక్సెస్ అయితేనే తప్ప కృతికి మరో ఛాన్స్ వచ్చేలా లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదివరకు చైతుతో కలిసి ‘బంగార్రాజు’ అనే సినిమాలో నటించింది కృతిశెట్టి. ఆ సినిమాలో సరైన కంటెంట్ లేనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మరోసారి అదే సక్సెస్ సెంటిమెంట్ వర్కవుట్ అవ్వాలి.

లేకపోతే కృతిశెట్టికి మరో టాలీవుడ్ లో మరో అవకాశం రావడం కష్టమని అంటున్నారు. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు రావడం కూడా కృతిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. పైగా కొన్ని ప్లాప్స్ రావడం ఆమె కెరీర్ పై బాగానే ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సవాళ్లను దాటుకొని కృతిశెట్టి ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ‘వారియర్’ సినిమాతో తమిళంలో కూడా లాంచ్ అయింది కృతిశెట్టి.

అయితే నేరుగా తమిళ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ అయితే ఆమెకి ఇప్పటివరకు రాలేదు. మలయాళంలో మాత్రం ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం అక్కడ ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus